Latest Tech Mobile Uncategorized

[Pre-Order] #OnePlus5T మొబైల్ – ఫీచర్లు , ధర పూర్తి వివరాలు

నిన్న రాత్రి #OnePlus5T మొబైల్ న్యూయార్క్ నగరంలో లాంచ్ అయింది . ఎప్పట్నుంచో అనుకున్నట్టుగానే ఫీచర్స్ ఉన్నప్పటికీ పేస్ ద్వారా అన్ లాక్ చేసే ఫీచర్ కొత్తగా జత చేసారు . ఈ పేస్ అన్ లాక్ ఫీచర్ ఆపిల్ కంపెనీ #iPhoneX Face id కంటే కూడా ఎంతో వేగవంతమైనదని OnePlus కంపెనీ తెలియ చేసింది.

Buy Now : http://amzn.to/2hEMmoO

వన్ ప్లస్ కంపెనీ #OnePlus5T మొబైల్ అన్ని మొబైల్ ల కంటే వేగంగా పని చేస్తుందని వన్ ప్లస్ కంపెనీ తెలిపింది. దీని ధర #OnePlus5 లానే 32,999 నుంచి మొదలవుతుంది. ఇందులో 6 GB అలాగే 8 GB వెర్షన్ లు రిలీజ్ చేశారు. 6 GB వెర్షన్ కు గాను 64 GB అంతర్గత మెమరీ , 8 GB వెర్షన్ కు గాను 128 GB మెమరీ లభిస్తుంది.

ప్రాసెసర్ విషయానికి వస్తే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ఆక్టా కోర్ 2.45 GHz ప్రాసెసర్ తో లభిస్తుంది. ఈ మొబైల్ ఏ ఇతర మొబైల్ తో పోల్చిన అత్యంత వేగవంతమైనదని కంపెనీ తెలిపింది.

కెమెరా విషయానికి వస్తే వెనుక వైపున డ్యూయల్ కెమెరా ని అమర్చారు. ఆ డ్యూయల్ కెమెరా లో మెయిన్ కెమెరా గా 16 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగిన Sony IMX 398 లెన్స్ ని జత చేశారు. సెకండరీ కెమెరా గా 20 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగిన IMX 376K లెన్స్ ని ఉపయోగించారు. ఈ డ్యూయల్ కెమెరా ద్వారా 4K వీడియో ని 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కి గాను, 1080P క్వాలిటీ తో 60 మరియు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కి గాను, 720P క్వాలిటీ ని 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కి గాను రికార్డ్ చెయ్యవచ్చు. స్లో మోషన్ ద్వారా 720P క్వాలిటీ లో 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ చెయ్యవచ్చు.

Buy Now : http://amzn.to/2hEMmoO

ముందు వైపు కెమెరా విషయానికి వస్తే 16 మెగా పిక్సెల్ సామర్థ్యం తో IMX 371 లెన్స్ తో లభిస్తుంది. ఈ ముందు కెమెరా ద్వారా 1080P క్వాలిటీ వీడియో ని 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అలాగే 720P వీడియో ని 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ చెయ్య వచ్చు.

డిస్ ప్లే విషయానికి వస్తే 6.01 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో 1080 x 2160 పిక్సెల్ రెసొల్యూషన్ తో ,401 PPI (పిక్సెల్ పర్ ఇంచ్) స్పష్టత తో, 18:9 నిష్పత్తి లో గొరిల్లా గ్లాస్ చే ప్రొటెక్ట్ చేయబడిన అమోలెడ్ డిస్ ప్లే లభిస్తుంది.

బ్యాటరీ విషయానికి వస్తే 3,300 mAh కెపాసిటీ తో , అరగంటలోనే ఒక రోజుకి సరిపడేంత ఛార్జ్ అయ్యేలా డాష్ ఛార్జ్ టెక్నాలజీ తో OnePlus5T లభిస్తుంది.

ఇందులో 3.5 MM ఆడియో జాక్ ని తిరిగి ప్రవేశ పెట్టారు. 3 మైక్రో ఫోన్ లు Noice Cancellation టెక్నాలజీ సపోర్ట్ తో ఈ మొబైల్ లో పొందు పరిచారు. కనెక్టివిటీ కోసం బ్లూ టూత్ 5.0 టెక్నాలజీ ని ఉపయోగించారు.

ఈ మొబైల్ బాక్స్ లో వినియోగదారులకి OnePlus5T మొబైల్, స్క్రీన్ ప్రొటెక్టర్, పారదర్శకంగా మొబైల్ కేస్, C – టైప్ కేబుల్, ఛార్జింగ్ అడాప్టర్, సిమ్ కార్డ్ తీసే పిన్ లభిస్తాయి.

ఈ మొబైల్ ఇండియాలో నవంబర్ 21 వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. వన్ ప్లస్ వెబ్ సైట్ ద్వారా, అమెజాన్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఈ మొబైల్ ని కొనవచ్చు. 6 GB వెర్షన్ 32,999 రూపాయలకు, 8 GB వెర్షన్ 37,999 రూపాయలకే లభిస్తుంది.

Buy Now : http://amzn.to/2hEMmoO

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *