Cyber Security Latest Tech Uncategorized

గూగుల్ క్రోమ్ యాడ్ ని స్పామ్ గా గుర్తించిన Youtube

Youtube ఈ మధ్య చాలా మంది youtubers యొక్క కంటెంట్ ని ఏ కారణము లేకుండా De-Monetize చేస్తుందని అందరికి తెల్సిందే. కానీ ఈసారి ఏకంగా గూగుల్ క్రోమ్ రన్ చేస్తున్న యాడ్ నే స్పామ్ వీడియో గ గుర్తించి కన్పించకుండా చేసింది .

YouTube అల్గోరిథం YouTube కంటెంట్ లో ఇబ్బందికరంగా ఉన్న కంటెంట్ ఆటోమేటిక్ గా తొలగించేలా డిజైన్ చేసారు. అదే పద్దతిలో గూగుల్ క్రోమ్ రన్ చేస్తున్న యాడ్ ని ఇబ్బందికరమైన కంటెంట్ ఉన్నదిగా గుర్తించి స్పామ్ గా ఫిల్టర్ చేసేసింది. youtube మరియు గూగుల్ క్రోమ్ రెండు గూగుల్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ కావడం ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం .ఈ విషయాన్ని త్వరలోనే తెలుసుకున్న YouTube వెంటనే ఇబ్బందిని సవరించి యాడ్ మళ్ళీ రన్ అయ్యేలా చేసింది. మెషీన్ లెర్నింగ్ లో ఇంకా మొదటి స్టేజి లలోనే ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే , భవిష్యత్ లో మొత్తం AI మెషీన్ లతో రన్ అయ్యేప్పుడు ఏ చిన్న తప్పు జరిగిన మానవాళి మొత్తం మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *