Latest Tech Uncategorized

Weekly RoundUp – ఈ వారం టెక్ విషయాలు క్లుప్తంగా.

ఈ వారం మొత్తం నాలుగు మొబైల్ ఫోన్స్ విడుదల అయ్యాయి .

ఫ్లిప్ కార్ట్ సొంత బ్రాండ్ తో తయారు చేసిన #BillionCapture Plus 3GB/4GB వెర్షన్ లలో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లలో లభిస్తుంది . 3 GB వెర్షన్ 10,999 కి, 4 GB వెర్షన్ 12,999 కి లభిస్తుంది. Buy Here : http://fkrt.it/pexhdTuuuN

మోటోరోలా కంపెనీ #MotoX4 మొబైల్ ని విడుదల చేసింది . ఈ మొబైల్ 3GB/4GB వెర్షన్ లలో లభిస్తుంది .3 GB వెర్షన్ 20,990 రూపాయలకి , 4 GB వెర్షన్ 22,990 రూపాయలకి లభిస్తుంది. Buy Here : http://fkrt.it/cPyEG!NNNN

Gionee M7 Power మొబైల్ 4 GB వెర్షన్ లో 16,999 అమెజాన్ వెబ్ సైట్ లో ప్రీ – ఆర్డర్ చెయ్యవచ్చు.

Buy Here : http://amzn.to/2jEEsws

#OnePlus5T మొబైల్ 6GB/8GB వెర్షన్ లలో లభిస్తుంది .6 GB వెర్షన్ 32,999 రూపాయలకు, 8 GB వెర్షన్ 37,999 రూపాయలకే లభిస్తుంది. Buy Here : http://amzn.to/2hEMmoO

HyperLoop కంపెనీ ఆంధ్ర , మహారాష్ట్ర , కర్ణాటక ప్రభుత్వాలతో MOU అగ్రిమెంట్ కుదుర్చుకుంది. హైపర్ లూప్ రవాణా విధానం ద్వారా చెన్నై నుంచి బెంగళూరు కు 20 నిమిషాలలో , పూణే నుంచి ముంబై కు 10 నిమిషాలలో , అమరావతి నుంచి విజయవాడకు 10 నిమిషాలలో వెళ్లొచ్చని HyperLoop తెలిపింది.

షియోమి కంపెనీ RedMi Note 4 ధరల్ని 1,000 రూపాయలు 3GB/4GB వెర్షన్ లపై తగ్గించింది. త్వరలో RedMi Note 5 విడుదల చెయ్యొచ్చు అని అందుకే ధరలు తగ్గించి ఉండొచ్చు అని సమాచారం. షియోమి కంపెనీ Q3 లో ఇండియాలో అత్యధికంగా అమ్మకాలు జరిపిన కంపెనీ గా నిలిచింది.

బిట్ కాయిన్ పై ఇండియాలో సందిగ్దత నెలకొంది. ఇండియాలో అనుమతించేలా వద్ద అన్న దానిపై త్వరలో ఎదో ఒక నిర్ణయం వెలువడవచ్చు. బిట్ కాయిన్ ప్రస్తుతం 7,770 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది.

UC browser ని ప్లే స్టోర్ నుంచి తొలగించారు. అనైతిక పద్ధతుల ద్వారా ఇంస్టాల్ చేయించడం ద్వారే ఇలా జరిగినట్లు సమాచారం.

మొజిల్లా కంపెనీ ఫైర్ ఫాక్స్ క్వాంటమ్ బ్రౌజర్ ని విడుదల చేసింది. ఇది క్రోమ్ బ్రౌజర్ కంటే వేగవంతమైనది అని మొజిల్లా తెలిపింది.

గూగుల్ పిక్సెల్ 2 మొబైల్ లో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవడంతో , వాటిని సరి చేసేందుకు గూగుల్ ప్రత్యేకంగా ఒక యాప్ ని విడుదల చేసింది.

ఇప్పటివరకు techtelugu.in గా ఉన్న వెబ్ సైట్ , ఇక నుంచి tech24.in గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *