Latest Tech Shopping Deals Uncategorized

జియో కు పోటిగా వొడాఫోన్ 1.5 GB ప్లాన్

జియో దాటికి దాదాపుగా అన్ని టెలికాం ఆపరేటర్ సర్వీస్ లు నష్టాలలో నడుస్తున్న సంగతి తెల్సిందే . ఎయిర్టెల్ మాత్రమే జియో పోటికి ఎదురొడ్డి నిలబదగలగడమే కాకుండా తక్కువ శాతంలో ఐన వినియోగదారులను పెంచుకోగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వొడాఫోన్ వినియోగదారులని కోల్పోకుండా ఉండేందుకు 349 రూపాయల ప్లాన్ ని లాంచ్ చేసింది.

ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ప్రతి రోజు 1.5 GB 3G/4G డేటా ని పొందవచ్చు. అదే జియో అయితే కేవలం 1 GB అదికూడా 4G కలిగిన హ్యాండ్ సెట్ లలో మాత్రమే ఉపయోగించుకోగలము. అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ చేసుకోవచ్చు. అపరిమిత అంటే రోజుకి గరిష్టంగా 250 నిమిషాలు, వారానికి 1,000 నిమిషాలు కాల్స్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ 28 రోజుల వరకు వర్తిస్తుంది. 3G హాండ్ సెట్ లు ఉన్న వాళ్లకు ఇది బెస్ట్ ప్లాన్. 4G వారికి మాత్రం జియో లో 91 , 70 రోజుల ప్లాన్ లతో పోలిస్తే జియో 459 , 499 ప్లాన్ లు వినియోగించడమే ఉత్తమం.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *