Mobile Uncategorized

ఈ మొబైల్ లకు #MIUI9 చివరి అప్ డేట్

#MIUI9 షియోమి కంపెనీ మొబైల్ లకి అందిస్తున్న లేటెస్ట్ అప్ డేట్. ఇంకా స్టేబుల్ వెర్షన్ మొదటి బ్యాచ్ మొబైల్ లకి మాత్రమే విడుదల అయింది . ఈ నెల చివరిలోపు అన్ని మొబైల్ లకి అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది . ఈ MIUI9 కొన్ని మొబైల్ మోడల్ లకు చివరి అప్ డేట్ అవుతుంది . దీని తర్వాత సాఫ్ట్ వేర్ పరంగా ఎలాంటి అప్ డేట్ ఆయా మొబైల్ లకు విడుదల చెయ్యక పోవచ్చు.

Mi 2/2S, Mi 4i, Redmi Note 4G , Redmi 2, Redmi 2 Prime మరియు Mi Note మొబైల్ లకి MIUI9 చివరి అప్ డేట్ . ఈ విషయాన్నీ ఒక ఫోరం పోస్ట్ లో కంపెనీ తెలియ చేసింది . బీటా అప్ డేట్స్ తో సహా ఇక ఎలాంటి అప్ డేట్స్ ఈ మొబైల్ లకి విడుదల చెయ్యట్లేదు అని కంపెనీ తెలిపింది . ఇక అప్ డేట్స్ రాని మొబైల్ మోడల్స్ అన్ని దాదాపుగా షియోమి కంపెనీ మొదలెత్తినప్పటి బేసిక్ మోడల్స్. సో, ఇప్పటి వరకు అప్ డేట్స్ ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే వేరే ఏ బ్రాండ్ కూడా పాత మోడల్ మొబైల్ గురించి అంతగా పట్టించుకోవు. MIUI9 మీకు ఇంకా రాకపోతే ఈ నెల చివరిలోపు కచ్చితంగా వస్తుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *