Uncategorized

2018 లో విడుదల కానున్న డ్యూయల్ సిమ్ Apple iPhone

2018 లో విడుదల చేయనున్న iPhone లో అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డ్యూయల్ సిమ్ వెర్షన్ రానుంది .KGI సెక్యూరిటీ అనలిస్ట్ Ming-Chi Kuo 2018 iPhone కి సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రస్తుతం ఇతర డ్యూయల్ సిమ్ మొబైల్ లలో ఉపయోగిస్తున్న 4G+3G విధానం కాకుండా అధిక వేగం ఉన్న 4G+4G సపోర్ట్ మరియు డ్యూయల్ స్టాండ్ బై తో iPhone 9 రానుంది, ఈ రెండో 4G sim Apple వాచ్ లో వచ్చిన విధంగా eSim టెక్నాలజీనా లేక లేదా రెండో సిమ్ స్లాట్ కలిగి ఉంటుందా అని తెలియాసి ఉంది. Qualcomm లేదా Intel చిప్ ను వాడనున్నటు తెలుస్తుంది.ఆపిల్ సంస్థ 2018 సంవత్సరంలో మూడు iPhone మొబైల్ లను విడుదల చేస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది . ఈ డ్యూయల్ సిమ్ మొబైల్ కాకుండా iPhoneX మినీ వెర్షన్ కూడా 2018 లో విడుదల చేయ్యనుంది . ఈ రెండు కాకుండా ఇంకో మోడల్ విడుదల చెయ్యబోతుంది . వీటి వివరాలేవీ ఇంకా స్పష్టంగా తెలియరాలేదు . ఇంటర్నెట్ లో మాత్రం వీటికి సంబంధించిన చిత్రాలుగా కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *