Apps Cyber Security Uncategorized

ఫ్లాష్ లైట్ యాప్ లలో బ్యాంక్ బాట్ మాల్వేర్

ఫ్లాష్ లైట్ ఫీచర్ మొబైల్ లో సాధారణంగా లేనప్పుడు ఫ్లాష్ లైట్ యాప్ డౌన్ లోడ్ చేస్కుని ఉపయోగించడం మనం అందరం చేస్తున్నదే . ఇక్కడే హ్యాకర్ లు కూడా తమ పని చూపించడం మొదలెట్టారు. గూగుల్ ప్లే స్టోర్ పరిశోధనలో కొన్ని ఫ్లాష్ లైట్ యాప్ లలో ఈ బ్యాంక్ బాట్ మాల్వేర్ ఉన్నట్టు తేలింది.

కొన్ని యాప్ లు ప్లే స్టోర్ లో ఉంచడమే బ్యాంక్ బాట్ ట్రోజన్ తో ఉండగా కొన్ని యాప్స్ మాత్రం యాప్ కు అప్ డేట్ వచ్చినట్లు వినియోగదారుని భ్రమింపజేసి Accessibility పర్మిషన్ ను తీస్కుంటారు. ఇలా తీస్కున్నాక వినియోగదారుడు తమ బ్యాంక్ కు సంబంధించిన వెబ్ సైట్ లాగిన్ అయ్యా వరకు వేచి ఉండి తరువాత నుంచి లాగిన్ వివరాలనన్నింటిని హ్యాకర్ కు అందించడం మొదలెడుతుంది. మెసేజ్ సర్వీస్ ను కూడా ఇంటర్సెప్ట్ (అడ్డుకుని) చేసి ఆ వివరాలని కూడా హ్యాకర్ కు అందిస్తుంది . ఇలాంటి యాప్స్ ని కొన్నింటి వరకు ప్లే స్టోర్ తొలగించగలిగింది కాని ఇంకా చాల వరకు యాప్స్ ఉపయోగించడం మొదలెట్టిన తరువాత యాప్ అప్ డేట్ పేరిట మాల్వేర్ ని డౌన్ లోడ్ చేస్తుండడంతో గూగుల్ కూడా గుర్తించలేక పోతుంది .

వీటి బారిన పడకుండా ఉండాలంటే ఆ యాప్ కు అవసరమైన పర్మిషన్ లు మాత్రమే అందివ్వాలి. ఫ్లాష్ లైట్ లాంటి యాప్ కు ఇంటర్నెట్ కనెక్షన్ కాని , మెసేజ్ లు , గ్యాల్లెరి పర్మిషన్ అనవసరం కాబట్టి ఇలాంటివి అడిగినపుడు కొంచెం జాగ్రతగా ఉండాలి .

Vishnu

May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *