Uncategorized

GPS ఆన్ లో లేకున్నా మీ ప్రతి కదలిక తెలుసుకుంటున్న Google

గూగుల్ మనకు మ్యాప్స్ అనే యాప్ ద్వారా మనం ఉన్న లొకేషన్ ని ట్రాక్ చేస్తూ దిశా నిర్దేశం చేస్తుంది అన్న సంగతి తెలిసిందే . కాని GPS కు యాక్సెస్ ఇవ్వనప్పటికీ కూడా గూగుల్ మన లొకేషన్ డేటా ని తీస్కున్తున్నట్లు Quartz Media సంస్థ ఆధారాలతో సహా నిరూపించింది. ఈ విషయమై గూగుల్ ను సంప్రదిస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్నీ ధృవీకరించినట్లు తెలిపారు.

GPS మాత్రమే కాదు , అసలు సిమ్ కార్డు లేకపోయినప్పటికీ మన లొకేషన్ ని ట్రాక్ చేసి ఇంటర్నెట్ కనెక్షన్ దొరికినప్పుడు ఆ డేటా ని గూగుల్ సర్వర్ లకి అందిస్తున్నట్లు క్వార్ట్జ్ మీడియా సంస్థ తెలిపింది . ఈ మధ్యనే మీరు గూగుల్ ట్రాఫిక్ అప్ డేట్స్ ఇవ్వడం గమనించే ఉంటారు . ఈ ట్రాఫిక్ అప్ డేట్స్ ని గూగుల్ ఆ ప్రాంతం లో ఆండ్రాయిడ్ డివైస్ లు ఎంత వేగంగా కదులుతున్నాయి అన్నదాన్ని బట్టి ట్రాఫిక్ అప్ డేట్స్ ఇస్తున్నట్లు తెలిసింది . అంటే దాదాపుగా ప్రతీ ఒక్క ఆండ్రాయిడ్ డివైస్ గూగుల్ కనుసన్నల్లో మెదులుతుంది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి గోప్యత ని ప్రశ్నిస్తూ ఉంది .

ఈ విషయమై గూగుల్ తమ గోప్యత నిభందనలలో ఇలా ప్రస్తావించింది .

“When you use Google services, we may collect and process information about your actual location. We use various technologies to determine location, including IP address, GPS, and other sensors that may, for example, provide Google with information on nearby devices, Wi-Fi access points and cell towers.”

దీన్ని ఏ విధంగాను తీసేసే సదుపాయం ప్రస్తుతానికి లేదు . గూగుల్ ఈ విధానం ని ఈ నవంబర్ నెల తరువాత తొలగిస్తాం అని చెప్పినట్లు క్వార్ట్జ్ మీడియా సంస్థ కు తెలిపినట్లు సమాచారం .

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *