Apps Uncategorized

UC Browser ని అనుమతించిన ప్లే స్టోర్

మోసపూరిత విధానాల ద్వారా యాప్ ఇంస్టాల్ జరిపినందువల్లె యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు అందరు అనుకుంటున్నా UC browser యాప్ ప్లే స్టోర్ లో మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. 500 మిలియన్ల కు పైగా డౌన్ లోడ్లు ఉన్న ఈ యాప్ ఒక వారం లోపే మల్లి ప్లే స్టోర్ లో ప్రత్యక్ష్యమైంది. ప్లే స్టోర్ తరచు సెక్యూరిటీ చెకింగ్ చేస్తూ మాల్వేర్ కలిగి ఉన్న యాప్ లను , తమ పాలసీ లను అతిక్రమించిన యాప్ లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉన్న విషయం తెల్సిందే .

UC browser యాప్ ను ఎందుకు తొలగించింది అన్నదానికి సమాధానంగా “గూగుల్ యొక్క పాలసీ లకు యాప్ సరిపోనందున తొలగించింది” అని స్పష్టం చేసింది . కాని ఏ విషయంలో పాలసీ నిబంధనలు అతిక్రమించింది అన్న విషయం తెలియజేయలేదు. ఇప్పుడు ప్లే స్టోర్ లో ఉంచిన UC browser తొలగించడానికి ముందు ఉన్న వెర్షన్ కంటే అప్ డేట్ అయినది. ఇందులో ఉన్న కొత్త ఫీచర్ల గురించి ఏ సమాచారము యాప్ గురించిన వివరణలో తెలపలేదు. ఈ యాప్ లో ముక్యమైన ఫీచర్ల గురించి చెప్పుకోవలసి వస్తే Small Window Mode గురించి చెప్పుకోవాలి. ఈ ఫీచర్ ద్వారా బ్రౌజరు లో చూస్తున్న వీడియో విండో ని చిన్నగా మార్చి స్క్రీన్ పై స్టిక్ చేసి వేరే మొబైల్ లో వేరే పనులు చెయ్యవచ్చు. Ad Blocker ఫీచర్ ద్వారా మీరు చూస్తున్న వెబ్ సైట్ కంటెంట్ లో నుంచి అనవసరమైన ads ని తీసేస్తుంది . Data Saver ఫీచర్ ద్వారా తక్కువ డేటా వినియోగించుకుని వెబ్ సైట్ ని వేగంగా లోడ్ చేస్తుంది. ఇందులో ఫైల్స్ ని వేగంగా డౌన్ లోడ్ చెయ్యవచ్చు అలాగే మధ్యలో డౌన్ లోడ్ ఆపేసి మల్లి అవసరమైనపుడు resume చెయ్య వచ్చు .

Download Here : UC Browser

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *