Apps Mobile Uncategorized

స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజి ప్రోగ్రాం లాంచ్ చేసిన Xiaomi

షియోమి ఈ నెలలో సెల్ఫీ ఫీచర్ ప్రధానంగా RedMi Y1 మొబైల్ ని , డ్యూయల్ కెమెరా తో గూగుల్ భాగస్వామ్యంతో MiA1 మొబైల్ ని విడుదల చేసింది. చాల మంది షియోమి వినియోగదారులు ఈ కొత్త డివైస్ లకు అప్ డేట్ అవ్వాలని అనుకుంటున్నారని భావించిన షియోమి ఎక్స్చేంజి ప్రోగ్రాం ని మొదలెట్టింది . ఈ ఎక్స్చేంజి ప్రోగ్రాం ఆఫ్ లైన్ లో దగ్గరలోని షియోమి స్టోర్ ల ద్వారా చేసుకోవచ్చు.

ఈ ఎక్స్చేంజి ప్రోగ్రాం ద్వారా ఏ బ్రాండ్ మొబైల్ అయిన సరే ఈ ప్రోగ్రాం లో ఎక్స్చేంజి చేసుకోవచ్చు. క్యాషి ఫై అనే యాప్ ద్వారా మీరు ఎక్స్చేంజి చెయ్యాలనుకున్న మొబైల్ యొక్క ధరను నిర్ణయించుకోవాలి. క్యాషి ఫై యాప్ మొబైల్ accessibility ఫంక్షన్ ద్వారా మొబైల్ యొక్క పూర్తి స్థితి గతులను అంచనా వేసి ఎంత ధరకు ఎక్స్చేంజి చేయబడుతుందో తెలియచేస్తుంది . ఆ ధర వినియోగదారునకు నచ్చితే ఎక్స్చేంజి టోకెన్ ని అందిస్తుంది . ఆ టోకెన్ ద్వారా షియోమి స్టోర్ లలో వినియోగదారునకు కావలసిన మొబైల్ ను మిగతా ధర చెల్లించి సొంతం చేసుకోవచ్చు . షియోమి ఇండియా లో నెంబర్ వన్ మొబైల్ బ్రాండ్ గ కొనసాగుతూ ఉంది . కాని నెంబర్ టూ అయిన సామ్ సంగ్ తో పోలిస్తే కేవలం 0.5 శాతం తేడా మాత్రమే ఉండడంతో ఆ మార్జిన్ ను పెంచుకోవడానికి షియోమి ప్రయత్నాలు చేస్తూ ఉంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *