Mobile Uncategorized

Google Pixel 2 లో కొత్త ఫీచర్ – Google Lens

పిక్సెల్ 2 లో గూగుల్ లెన్స్ అనే ఫీచర్ ని వచ్చే వారం అప్ డేట్ ద్వారా ఇవ్వనున్నట్టు గూగుల్ తన బ్లాగ్ ద్వారా తెలియజేసింది.ఈ ఫీచర్ గూగుల్ అసిస్టెంట్ కి అదనపు ఫీచర్ గా పని చేయనుంది. పిక్సెల్ 2 విడుదల సమయం లో ఈ ఫీచర్ గురించి గూగుల్ ప్రస్తావిస్తూ అప్ డేట్ ద్వారా ఈ ఫీచర్ పొందవచ్చు అని తెలియజేసింది.

గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేయగానే కుడి వైపు చివర కెమెరా ఐకాన్ క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు తెలుసుకోవాలి అనుకుంటున్న వాటి ఫోటో తెస్తే చాలు గూగుల్ అసిస్టెంట్ మీరు తీసిన ఫోటో గురించి పూర్తి వివరాలు తెలియగేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు పుస్తకాలు, లోగో, విగ్రహాలు, ప్రాంతాలు, సినిమాలు, బార్ కోడ్, ఇలా రకరకాల విషయాల గురించి తెలుసుకోవచ్చు. గూగుల్ లెన్స్ సహాయం తో మీ గ్యాలరీ లో మీరు ఇంతకు ముందే తీసిన ఫోటో ల గురించి కూడా తెలుసుకోవచ్చు.

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *