Mobile Uncategorized

6,999 కే Nokia 2 మొబైల్ – ఈరోజు నుంచి అమ్మకాలు మొదలు

HMD గ్లోబల్ సంస్థ నోకియా బ్రాండ్ ని తిరిగి పునరుద్ధరించడంలో దాదాపుగా విజయవంతమయినట్టే. నోకియా బ్రాండ్ లో వస్తున్న దాదాపు అన్ని మొబైల్ లు ప్రజాదరణ విషయంలో మెరుగ్గానే ఉన్నాయి. ఆ కోవలోనే ఈ మధ్యనే విడుదల అయిన నోకియా 2 ఇండియా లో ఈరోజు నుంచి (24-Nov-2017) ఆఫ్ లైన్ స్టోర్ ల ద్వారా అమ్మకాలు మొదలెట్టనుంది.

నోకియా 2 మొబైల్ నోకియా బ్రాండ్లో తక్కువ ధరల శ్రేణిలో వస్తున్న మొబైల్. ఈ మొబైల్ ఫీచర్లు ఆదరగొట్టాయి.6,999 ధరలో ప్రస్తుతం ఇదే అత్యుత్తమ మొబైల్ అని చెప్పవచ్చు.నలుపు , తెలుపు మరియు కాపర్ రంగుల్లో ఈ మొబైల్ లభిస్తుంది. జియో ఆఫర్ ద్వారా 45 GB డేటా లభిస్తుంది . 8GB ఇంటర్నల్ మెమరీ తో , 1 GB RAM తో లభిస్తుంది. వెనుక వైపున 8 మెగా పిక్సెల్ , ముందు వైపున 5 మెగా పిక్సెల్ సామర్థ్యం తో కెమెరా లభిస్తుంది. 5 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో ఈ మొబైల్ విడుదల అయింది.దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని 4,100 mAh బ్యాటరీ. కంపెనీ కూడా బ్యాట్టరీ 2 రోజులు వస్తుంది అని ప్రకటించింది. నౌగట్ వెర్షన్ ద్వారా పని చేస్తోంది. ఓరియో అప్ డేట్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కంపెనీ తెలిపింది. గూగుల్ అసిస్టెంట్ సహితంగా ఈ మొబైల్ వస్తుంది అని కంపెనీ విడుదల చేసిన వీడియో లో ఉంది.

Buy On Amazon : http://amzn.to/2zwVzqZ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *