Mobile Uncategorized

Infinity display తో సామ్ సాంగ్ A5

సామ్ సాంగ్ నుంచి A సిరీస్ లో 2018 లో మొబైల్స్ విడుదల అవ్వబోతున్నట్లు తెలిసిందే. లేటెస్ట్ గా సామ్ సాంగ్ ఫ్లాగ్ షిప్ మొబైల్ గా విడుదల అవుతున్న సామ్ సాంగ్ గెలాక్సీ A5 మొబైల్ కు సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో సామ్ సాంగ్ గెలాక్సీ A5 కు సంబంధించిన బ్యాక్ కేస్ ని చూపించే క్రమంలో మొబైల్ డిజైన్ లీక్ అయింది.

ఫోటో ప్రకారం సామ్ సాంగ్ గెలాక్సీ A5 మొబైక్ infinity display తో విడుదల అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సామ్ సాంగ్ గెలాక్సీ S అలాగే నోట్ సిరీస్ లకి ఈ A సిరీస్ కు కచ్చితమైన తేడా చూపించాలనుకుంటుంది. సామ్ సాంగ్ గాలక్సీ A5 లో bixby స్మార్ట్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉన్నట్లు లాక్ స్క్రీన్ లో ఉన్న ఐకాన్ ను బట్టి తెలుస్తుంది. ఈ మొబైల్ జనవరి 2018 లొనే విడుదల అవ్వొచ్చు. 4gb లేదా 6 gb RAM ఉండొచ్ఛు. సామ్ సాంగ్ గెలాక్సీ A5 లో ఓరియో ఆపరేటింగ్ సిస్టం లేదు. నౌగట్ వెర్షన్ తోనే విడుదల అవ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *