Apps Uncategorized

100 రకాల ప్రభుత్వ సర్వీస్ లతో UMANG యాప్

BHIM అప్లికేషన్ తర్వాత నరేంద్ర మోడీ గారు UMANG పేరిట ఇంకో యాప్ ను లాంచ్ చేసారు. ఈ యాప్ ద్వారా పలు రకాల ప్రభుత్వ సేవలు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. UMANG అంటే Unified Mobile Application for New-age Governance అని అర్థం . ఈ యాప్ ద్వారా దాదాపుగా 100 వరకు సర్వీస్ లు అందించబడతాయని తెలిపారు.

ప్రస్తుతానికి చాల వరకు సర్వీస్ లు కేంద్ర ప్రభుత్వానివే ఉన్నప్పటికీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ లని కూడా ఈ యాప్ కు అనుసంధానిస్తున్నట్లు యాప్ లో ప్రత్యేక విభాగాలు కేటాయించడం ద్వారా తెలుస్తూ ఉంది . మన ఆంధ్ర , తెలంగాణా ప్రభుత్వ సర్వీస్ లు అయితే ఇప్పటి వరకు ఏవి లిస్టు కాలేదు . కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన EPFO సర్వీస్ (ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ సర్వీస్ ) , Pharma Sahi Daam (మందులు సరైనవో కావో తెలుసుకునే సర్వీస్ ) ,Kisan Suvidha (రైతులకు ఉపయోగపడే హెల్ప్ లైన్ సర్వీస్ ) , Bharat Bill Pay (బిల్లులు చెల్లించడానికి) , PassPort Seva (పాస్ పోర్ట్ అవసరాలకు ) ఇలా పలు సర్వీస్ లు లిస్టు చెయ్యబడి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సర్వీస్ లు కూడా త్వరలో లిస్టు చేస్తారు.

యాప్ డౌన్ లోడ్ కొరకు : https://play.google.com/store/apps/details?id=in.gov.umang.negd.g2c

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *