Mobile Uncategorized

షియోమి బ్రాండ్ నుంచి #Redmi సిరీస్ లో కొత్త మొబైల్ – #DeshKaSmartPhone

RedMi సిరీస్ నుంచి కొత్త మొబైల్ ని ఈ 30 వ తేదిన లాంచ్ చెయ్యనున్నట్లు షియోమి సంస్థ తెలిపింది. RedMi నుంచి వచ్చిన చివరి మొబైల్ RedMi 4, కాబట్టి రాబోయే మొబైల్ RedMi 5, లేదా RedMi 4X అయ్యిండొచ్చు. షియోమి కి సంబంధించినంత వరకు ఏ మొబైల్ అయిన సరే చైనా లో ముందు విడుదల అయ్యాకే ఇండియా లో విడుదల అవుతాయి.

చైనా లో ఇంకా RedMi 5 విడుదల కాలేదు , కాని RedMi 4X అయ్యింది. ఈ రకంగా చూస్తే RedMi 4X విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ , షియోమి కంపెనీ 30 వ తేదిన విడుదల చెయ్యబోతున్న మొబైల్ ని “Desh Ka Mobile” పేరిట లాంచ్ చేయ్యనుంది . ఈ ప్రకారంగా చూస్తే ఇండియా లోనే మొట్ట మొదటగా కొత్త మోడల్ ని లాంచ్ చెయ్యబోతున్నార అన్నది వేచి చూడాలి. RedMi 5 ఫోటోలు ఇంతకుముందే అనధికారికంగా లీక్ అయ్యాయి . ముందు వైపు స్క్రీన్ అంచులు లేకుండా 18:9 డిస్ ప్లే తో విడుదల అవ్వనుంది. షియోమి ఇండియా లో నెంబర్ వన్ బ్రాండ్ గ ఎదగడానికి కారణమైన RedMi సిరీస్ మొబైల్ లకి మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది. వీటికి పోటిగా Nokia బ్రాండ్ Nokia 2 మొబైల్ ధరని ఇండియా లో 6,999 ధరకు నిర్ణయించి ఈరోజు నుంచి అమ్మకాలు మొదలెట్టనుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *