Mobile Uncategorized

OnePlus 5 తో పోల్చితే OnePlus 5T కి అప్ డేట్ అయిన ఫీచర్లు

మార్కెట్ లో ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ రేంజ్ మొబైల్ లలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న మోడల్ OnePlus5T. ఈ మొబైల్ అందరూ అనుకుంటున్నట్టు కేవలం OnePlus5 మొబైల్ కి కొనసాగింపు వెర్షన్ ఏ మమాత్రం కాదు. ఎందుకంటే ఇందులో కొత్త ఫీచర్లు జత అవ్వడం వలన ఇది OnePlus5 కంటే ఎంతో ఉత్తమమైనది. కేవలం హార్డ్ వేర్ పరంగానే కాకుండా సాఫ్ట్ వేర్ పరంగా కూడా ఈ మొబైల్ లో కొత్త ఫీచర్లు జత చేశారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోతగ్గవి.

Face UnLock

OnePlus5 లో ఈ ఫేస్ అన్ లాక్ ఫీచర్ అందుబాటులో లేదు. OnePlus5 లో ఫింగర్ ప్రింట్ ద్వారానే అన్ లాక్ చేయగలం. కానీ OnePlus5T లో మాత్రం ఫేస్ అన్ లాక్ తో బాటు వెనుక వైపున ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం కూడా ఉంది. ఈ ఫింగర్ ప్రింట్ కు గెశ్చర్ (సంజ్ఞలు) ల ద్వారా OnePlus5T మొబైల్ లో నోటిఫికేషన్ లు స్లయిడ్ చెయ్యడం ,లాంగ్ ప్రెస్ ద్వారా ఫోటోలు కాప్చర్ చెయ్యడం లాంటివి చెయ్యొచ్ఛు.

Parallel Apps

OnePlus5T లోని ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం కు కొత్త ఫీచర్ జోడించడం ద్వారా OnePlus లో లేటెస్ట్ మొబైల్ అయినటువంటి OnePlus5T లో ఈ parallel యాప్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది . ఈ ఫీచర్ ద్వారా ఒకే మొబైల్ లో ఒకే యాప్ ని రెండు గా మార్చి ఇద్దరు వినియోగించవచ్చూ. ఈ ఫీచర్ ద్వారా ఒకరి డేటా కలిగిన యాప్ ఇంకొకరు యాక్సిస్ చేసే అవకాశం లేకుండా ఇద్దరు ఒక యాప్ ని వినియోగించవచ్చు.

Gallery Map

ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం లొని గాలరీ యాప్ కె కొంచెం మార్పులు చేశారు. ఏ మార్పుల వల్ల గాలరీ లో మనం తీసుకున్న ఫోటోలకు లొకేషన్ కూడా జత అయ్యి కన్పిస్తాయి. గూగుల్ ఫొటోస్ లో లానే ఈ ఫీచర్ OnePlus5T లో పని చేస్తోంది.

Navigation Bar

ఏ మొబైల్ లో అయిన మెనూ ని యాక్సిస్ చెయ్యాలంటే నావిగేషన్ బార్ ఏ కీలకం. ఈ నావిగేషన్ బార్ లో కొన్ని మార్పులు చేశారు. OnePlus5T లో నావిగేషన్ బార్ ని కనిపించకుండా చెయ్యవచ్చు. మీరు వేరే ఏ యాప్ ని అయిన పూర్తి 6.1 ఇంచ్ స్క్రీన్ వినియోగించడానికి ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. నావిగేషన్ బార్ ను కనిపిమ్చాకుండా చేసాక చైనా బటన్ మీకు స్క్రీన్ పై పారదర్శకంగా కన్పిస్తు ఉంటుంది. ఆ బటన్ ద్వారా నావిగేషన్ బార్ ను యాక్సెస్ చెయ్యవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *