Cyber Security Uncategorized

9,000 డాలర్లు దాటిన Bit Coin విలువ

బిట్ కాయిన్ ధర మళ్ళీ ఎగిసింది. ఈసారి కేవలం 6 రోజుల్లోనే 1,000 డాలర్లు పెరిగింది. Tether హ్యాక్ అయిన కారణంగా బిట్ కాయిన్ మరియు ఇతీరియం విలువ కొంత తగ్గినప్పటికి రెండు క్రిప్టో కరెన్సీ లు మల్లి పుంజుకుని దూసుకెళ్తున్నాయి.

Bit Coin విషయానికి వస్తే మరే ఇతర క్రిప్టో కరెన్సీ పెరగనంతగా దాదాపుగా 45 రోజుల్లోనే 5,000 డాలర్ల పైగా అంటే 3,50,000 రూపాయలకు పైగా మారకం విలువ పెరిగింది. ఇతీరియం విషయానికి వస్తే ఈ వారంలో దాని విలువ ఇంతకుముందెన్నడు లేనంతగా పెరిగింది. ప్రస్తుతం 1 ETH (ఇతీరియం ) విలువ 458 డాలర్లుగా ఉంది. బిట్ కాయిన్ విలువ 9,052 డాలర్లుగా ఉంది. ఇంకో వారంలో 10,000 డాలర్లను సులభంగా అందుకోగలుగుతుంది. 6 రోజుల క్రితం 8,000 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్, Tether (ఇంకో క్రిప్టో కరెన్సీ ) హ్యాక్ అవ్వడం వల్ల కొంచెం వెనుకంజ వేసినప్పటికి మళ్ళీ పుంజుకుని 9,000 డాలర్ల మార్క్ ను దాటి వేసింది. 10,000 దాటాక నెమ్మదిగా బిట్ కాయిన్ పతనం చవి చూస్తుందని JP మోర్గాన్ సంస్థ తెలిపిన విషయం అందరికి తెలిసిందే. కానీ బిట్ కాయిన్ జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *