Mobile Shopping Deals Uncategorized

ఇండియాలో Levovo K8 Note ధర తగ్గింది – పూర్తి వివరాలు.

Lenovo K8 note ధర శాశ్వతంగా వెయ్యి రూపాయలు తగ్గింది. Lenovo K8 note రెండు వెర్షన్ లలో లభిస్తుండగా ఆ రెండు వెర్షన్ లకు 1,000 రూపాయల ధర తగ్గింది. Lenovo K8 note ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలో విడుదల అయింది. విడుదల అయిన మూడు నెలల్లోనే 1,000 ధర తగ్గడానికి కారణం ఒక రకంగా షియోమి RedMi Note 4 పై ధర తగ్గించడమే కావొచ్చు.

Buy nowhttp://amzn.to/2BdqgxM

Lenovo K8 note 3 GB మరియు 4 GB వెర్షన్ లలో అందుబాటులో ఉంది. 3 GB వెర్షన్ 12,999 రూపాయలు ఉండగా 1,000 రూపాయల ధర తగ్గి 11,999 కె లభిస్తుంది. అలాగే 4 GB వెర్షన్ ధర 13,999 రూపాయలు ఉండగా , 1,000 ధర తగ్గి 12,999 రూపాయలకు లభిస్తుంది.

Lenovo K8 note ఫీచర్లు :
Lenovo K8 note లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డ్యూయల్ కెమెరా ఫీచర్. ఈ మొబైల్ కు వెనుక వైపున 13 MP + 5 MP కెమెరాలు ఉన్నాయి. ముందు వైపున 13 MP కెమెరా సెల్ఫీ , వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంది. Lenovo K8 note 3 GB RAM వెర్షన్ లో 32 GB అంతర్గత మెమరీ ,అలాగే 4 GB RAM వెర్షన్ లో 64 GB అంతర్గత మెమరీ తో లభిస్తుంది. 4,000 mAh బ్యాటరీ Lenovo K8 note కు దాదాపుగా 1 1/2 రోజుల వరకు పని చేసేంత కెపాసిటీ ని అందివ్వగలదు. స్క్రీన్ విషయానికి వస్తే 5.5 ఇంచ్ డిస్ ప్లే తో 1920 x 1080 రెసొల్యూషన్ తో HD క్వాలిటీ తో లభిస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది.హెలియో X23 10-కోర్ ప్రాసెసర్ పై 2.3 GHz వేగంతో పని చేస్తోంది. Lenovo K8 note ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారితంగా పని చేస్తోంది. వెనుక వైపున ఫింగర్ ప్రింట్ సదుపాయం కూడా ఉంది.
Buy now : http://amzn.to/2BdqgxM

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *