Mobile Uncategorized

పూర్తీ వివరాలతో లీక్ అయిన RedMi note 5

 

ఇండియా లో అత్యధికంగా అమ్ముడు అయిన RedMi note 4 సిరీస్ లో నెక్స్ట్ వస్తున్న Mi note 5 మొబైల్ కి సంబంచిన ఫొటోస్ చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా లీక్ అయ్యాయి.లీక్ అయిన ఫోటో ప్రకారం 5.99 ఇంచ్ స్క్రీన్, 2160 × 1800 పిక్సెల్ రెసొల్యూషన్ కలిగి ఉండి అతి చిన్న బెజల్ స్క్రీన్ కలిగి ఉండి, ఈ మధ్య బాగా పాపులర్ అయినా 18:9 నిష్పత్తి కలిగి ఉంది. వెనుక వైపు 12 మెగా పిక్సెల్ గల కెమెరా, ముందు వైపు కెమెరా పిక్సెల్ గురించి తెలియాల్సి ఉంది. Snapdragon 630 చిప్, 4GB రామ్ మరియు 60GB అంతర్గత మెమరీ కలిగి ఉంది. 4000 mAh సామర్థ్యము కలిగి ఉన్న బ్యాటరీ, ఆండ్రాయిడ్ Nougat 7.1.2 ఆధారిత Miui 9 ప్రీ ఇంస్టాల్ అయి ఉంది.

RedMi Note 5 కి సంబంధించి Xiaomi అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. 2017 Q3 ఇండియన్ మొబైల్ మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడు అయినా బ్రాండ్ గా Xiaomi స్థానం సంపాదించింది. నవంబర్ 30 న #deshkasmarthphone అనే  ట్యాగ్ లైన్ తో ఒక ఒక ఈవెంట్ నెర్వహిస్తుంది . ఈ ఈవెంట్ లో విడుదల చేయబోయే మొబైల్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అది Note 5 న లేదా కొత్త మొబైల్ ను విడుదల చేయనున్నారా తెలియాల్సి ఉంది.లీక్ అయిన ఫోటోని మీరు కింద చూడవచ్చు.

 

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *