Cyber Security Uncategorized

ఇండియాలో జరగనున్న మొట్ట మొదటి BitCoin కాన్ఫరెన్స్ కు వేదికైన హైదరాబాద్

గేమింగ్ స్పేస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇండియాలో మొట్ట మొదటి బిట్ కాయిన్ కాన్ఫరెన్స్ జరగనుంది. బిట్ కాయిన్ 10,000 కు చేరువవుతున్న నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్ ఇండియాలో ఎన్నో అవకాశాలకు బీజం కానుంది. ఇండియాలో బిట్ కాయిన్ పై నిషేధం విధించాలా వద్ద అన్నదానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోగా ఈ సమావేశం ప్రభుత్వానికి కూడా త్వరగా నిర్ణయం తీసుకోడానికి హేతువు కానుంది.

GAMBIT 2017 పేరున నవంబర్ 27 న నిర్వహిస్తున్న ఈ కాన్ఫిరెన్సు లో కెవిన్ హమ్, ico.com స్థాపకుడు జయ్ వెయి, NamekartIndia స్థాపకుడు కెవిన్, మొహాత్ మదన్ లు పాల్గొననున్నారు. Namekart.com, Descrow.com, Corion.io, Binary.com అద్వర్యం లో జరుగనుంది.ఈ కాన్ఫరెన్స్ లో బిట్ కాయిన్ అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ పై లోతుగా సమాచారం ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా గేమింగ్ కు సంబంధించిన విషయాలపై కూడా ఈ సదస్సులో చర్చించవచ్చు.

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *