Mobile Uncategorized

జియో ఫోన్ అమ్మకాలు మళ్ళీ మొదలు

జియో ఫోన్ మార్కెట్ లో సృషించిన సంచలనం మళ్ళీ కొనసాగనుంది. రెండవరౌండ్ జియో ఫోన్ బుకింగ్ ను రిలయన్స్ కొనసాగించనుంది. ఈసారి మాత్రం మొదటి సారిలా బారులు తీరే అవసరం లేకుండా మొబైల్ అమ్మకాలు జరపనుంది.

మొదటి రౌండ్ జియో మొబైల్ కోసం My Jio యాప్ ద్వారా ఆసక్తి కనబరిచిన వారందరికీ ఈ సారి ఒక లింక్ ను మెసేజ్ ద్వారా పంపిస్తారు.  ఆ మెసేజ్ ను క్లిక్ చేస్తే ఒక కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ ని దగ్గరలో ఉన్న జియో స్టోర్ కు తీసుకెళితే జియో మొబైల్ ని అందజేస్తారు. ఈ మెసేజ్ లు అందరికి రావు. కేవలం ఆసక్తి కనబరిచిన వారికి మాత్రమే వస్తాయి. దీనికోసం రిజిస్టర్ చేసుకోవాలి. జియో మొబైల్ చూడడానికి సాధారణ మొబైల్ లా కనిపించినప్పటికి ఇందులో కొన్ని ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. జియో లో స్మార్ట్ అసిస్టెంట్ , TV కి కనెక్ట్ చేసుకునే ఫీచర్ ఈ రేంజ్ ధరలో ఏ మొబైల్ లకు కూడా లేవు. వీడియో కాలింగ్ సపోర్ట్ కూడా ఉండడం విశేషం.

మీరు కూడా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఈ కింది లింక్ ద్వారా చేసుకోవచ్చు.

http://bit.ly/2Ah1FZP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *