Gadgets Uncategorized

94% వృద్ధి తో దూసుకెళ్లిన Lenovo టాబ్లెట్ PC అమ్మకాలు


మొబైల్ ఫోన్ ల దూకుడుతో టాబ్లెట్ మార్కెట్ క్షీణిస్తూ ఉండగా,తాజా గా లెనోవో టాబ్లెట్ మార్కెట్ లో దూసుకెళుతు ఉంది. టాబ్లెట్ మార్కెట్ క్షీణించడానికి కారణం దాదాపుగా మొబైల్ కేవలం 1 ఇంచ్ తేడాతో టాబ్లెట్ సైజ్ కు దగ్గర దగ్గర గా వస్తు ఉన్నాయి. అందుకే మొబైల్ కొనడానికే అందరూ ఇష్టపడుతున్నారు.

ప్రతీ సంవత్సరం 4% వరకు టాబ్లెట్ PC ల వినియోగం తగ్గిపోతు ఉండగా, ఈ Q3 లో లెనోవో 20.3 శాతం మార్కెట్ షేర్ తో Q2 తో పోల్చితే 94 శాతం వృద్ధితో మార్కెట్ లో నెంబర్ వన్ గా దూసుకెళ్తు ఉంది. ఈ వివరాలని CMR రీసెర్చ్ సంస్థ ప్రకటించింది. acer 16 శాతం మార్కెట్ తో రెండవ స్థానంలో ఉంది.

“Q3 లో బలమైన వృద్ధి కి విద్య పరంగా B2B మార్కెట్ లో జరిగిన అమ్మకాలు కీలకమైన పాత్ర పోషించాయి” అని CMR రీసెర్చ్ సంస్థ లీడ్ అనలిస్ట్ (ముఖ్య విశ్లేషకుడు) తెలిపారు.

లెనోవో యొక్క 94 శాతం వృద్ధి కేంద్ర ప్రభుత్వం యొక్క “NAMO E-Tab సహా యోజన ” పథకం ద్వారా లెనోవో టాబ్లెట్ లు అందివ్వడం వలనే వృద్ధి చెందినట్లు CMR సంస్థ తెలిపింది. Lenovo Tab 3.7 ఇంచ్ మోడల్ మొత్తం 20 శాతం మార్కెట్ లో 13 శాతం మార్కెట్ వాటా ని కలిగి ఉంది. Phablet ల వినియోగం వల్లనే టాబ్లెట్ మార్కెట్ అంతకంతకూ క్షీణించడానికి ముఖ్య కారణం. ఏ మాత్రం ఫీచర్లు వేరుగా లేకపోవడంతో అందరూ phablet ని కొనడానికే ఇష్టపడడం కూడా ఇంకో కారణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *