Cyber Security Uncategorized

Apple సాఫ్ట్ వేర్ లో తీవ్రమైన సెక్యూరిటీ లోపం.

Apple కంపెనీ తయారు చేసిన Mac (Macinthosh Sierra OS) లో ఒక తీవ్రమైన సెక్యూరిటీ లోపాన్ని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఈ బగ్ ద్వారా పాస్ వర్డ్ అవసరం లేకుండానే అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ని సంపాదించవచ్చు. టర్కీ దేశానికి చెందిన Lemi Ergin ఈ లోపాన్ని కనుగొన్నాడు.

ఈ లోపం ద్వారా యూజర్ నేమ్ దగ్గర root అని టైపు చేయడం ద్వారా పాస్ వర్డ్ ఎంటర్ చెయ్యకుండా కొన్ని సార్లు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటె అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ తో Mac కంప్యూటర్ అన్ లాక్ అయిపోతుందని Lemi Ergin తెలిపారు. ఈ లోపాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కరించి దానికి సంబంధించిన అప్ డేట్ ని విడుదల చేస్తామని Apple ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ బగ్ ను బయటపెట్టినందుకు Lemi Ergin ను అందరు దుయ్యబడుతున్నారు . ఎందుకంటే ఇలాంటివి కనుగోన్నపుడు ముందుగ సంబంధిత కంపెనీ కి సమచారమిచ్చి , వారు ఆ బగ్ ని పరిష్కరించే వరకు వారికి సహకరించి అప్పుడు కంపెనీ అనుమతితో అందరికి తెలియజేయాలి . ఇలా కంపెనీ కి సమాచారమివ్వకుండా పబ్లిక్ గా వెల్లడించడం వల్ల హ్యాకర్ లకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది .

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *