Latest Tech Uncategorized

మీ ఫోన్ ని వేరే వ్యక్తులు చూస్తుంటే పసిగట్టేసే AI తయారు చేసిన గూగుల్

మనం మొబైల్ ఉపయోగించేటప్పుడు వెనుక వైపు నుంచి గమనించే వాళ్ళని మనం చూసి ఉంటాము. అలాంటి సమయాల్లో చాలా సార్లు మనకు వాళ్ళు చూస్తున్నట్టు కూడా తెలియదు. మనం పాస్ వర్డ్ ఎంటర్ చేస్తున్నా, లేక గోప్యంగా ఏవైనా విషయాలు చర్చిస్తూ ఉన్నా వేరే వాళ్ళు చూసేస్తే ఎంతో ప్రమాదం

గూగుల్ కృత్రిమ సాంకేతికత దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. చాలా వేగంగా ఇలాంటివాటికి అడ్డుకోడానికి గూగుల్ సాంకేతికత తోడ్పడనుంది. ఎవరైనా మొబైల్ వైపు చూస్తూ ఉంటే వెంటనే స్క్రీన్ పై రెడ్ మార్క్ తో అలెర్ట్ చూపిస్తూ స్నాప్ చాట్ లాంటి ఫిల్టర్ లతో రెడ్ హ్యాండెడ్ గా చూస్తున్న వ్యక్తిని పట్టిస్తుంది. దీంతో మీరు అలెర్ట్ అవ్వవచ్చు. ఈ ప్రాసెస్ అంతే కేవలం 2 మిల్లి సెకండ్ లలో జరిగిపోతుంది. గూగుల్ దీన్ని ఆండ్రాయిడ్ లోకి త్వరలో తీసుకు రావచ్చు. కృత్రిమ సాంకేతికత సృష్టించే అద్భుతాలు మున్ముందు మనం ఎన్నో చూడవచ్చు. మానవ జీవితాల్ని సుగమం చెయ్యడానికి ఈ కృత్రిమ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *