Mobile Uncategorized

సామ్ సాంగ్ లాంచ్ చేసిన గెలాక్సీ S8 ఎరుపు రంగు వెర్షన్

సామ్ సాంగ్ గెలాక్సీ S8 మొబైల్ ఇప్పటిదాకా 6 రంగుల ఆప్షన్స్ లో లభిస్తుండగా ఇప్పుడు కొత్తగా burgundi red రంగు లో కూడా అధికారికంగా విడుదల చేసారు. ఈ మోడల్ ని ముందుగా సౌత్ కొరియా లో లాంచ్ చేసి మిగతా మార్కెట్ లలో కూడా వెంటనే విడుదల చేస్తారు.

సామ్ సాంగ్ గెలాక్సీ S8 లాంచ్ అప్పుడు Mid Night Black, Orchid Grey, Coral Blue, Arctic silver, Maple Gold, Rose Gold రంగులలో విడుదల చేసింది. ఇప్పుడు కొత్తగా burgundi red రంగులో విడుదల చేసింది. ఈ మొబైల్ 5.8 ఇంచ్ స్క్రీన్ తో, 1420 x 2960 రెసొల్యూషన్ తో, 4 GB RAM తో, 64 GB అంతర్గత మెమరీ తో, 1.9 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ తో, వెనుక వైపు 12 మెగా పిక్సెల్ సామర్థ్యం కల కెమెరా,ముందు వైపు 8 మెగా పిక్సెల్ సామర్థ్యం కల కెమెరా తో , 3,000 mAh బ్యాటరీ కెపాసిటీ తో , ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేస్తోంది. దీని ధర 53,900 రూపాయలు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *