Mobile Uncategorized

ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభించనున్న #deshkasmarthphone

షియోమి కంపెనీ రేపు (30-11-2017) న లాంచ్ చెయ్యనున్న కొత్త DeshKaMobile ఆన్ లైన్ లో కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభించనుంది . ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్లు, ధర, మోడల్ వంటి ఏ వివరాలు బయటకి రానప్పటికీ బ్యాట్టరీ పరంగా ఎదో సంచలనమే సృష్టించ వచ్చు అన్నట్లు కంపెనీ విడుదల చేసిన కొన్ని ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తుంది .

షియోమి ఈ రెండు నెలలలో MiMix2 , RedMi Y1, MiA1 మొబైల్ లను లాంచ్ చేసింది. ఈ నెలలోనే షియోమి బ్రాండ్ ఇండియా లో అత్యధిక మొబైల్ ఫోన్ లు అమ్ముతున్న బ్రాండ్ గా మారింది. కాని మొదటి స్థానం లో ఉన్న షియోమి కి , రెండవ స్థానంలో ఉన్న సామ్ సంగ్ కి ఉన్న తేడా 0.5 శాతం మాత్రమే . ఈ తేడా ని పెంచడానికి ఎప్పుడు ఇండియా లో లాంచ్ ప్లాన్ చెయ్యని షియోమి ఈ సరి లాంచ్ ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా షియోమి కి ఇండియా అతి పెద్ద మార్కెట్ . ఈ మార్కెట్ ని విస్తృతం చెయ్యడానికి #DeshKaSmartPhone ట్యాగ్ లైన్ తో ఇండియా వినియోగాదారులకే ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తలపించేలా లాంచ్ ప్లాన్ చేస్తూ ఉంది . రేపు ఈ లాంచ్ ప్రక్రియ ఇండియా లో జరగబోతుంది . క్రింది వీడియో లలో షియోమి ప్రచార చిత్రాలు మీరు చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *