Apps Uncategorized

మీ డేటా వృధా ని అరికట్టేందుకు గూగుల్ విడుదల చేసిన కొత్త యాప్ Datally

మన మొబైల్ లో చాల వరకు యాప్ లు బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ మనకు తెలియకుండానే డేటా ని వినియోగిస్తూ ఉంటాయి. వీటిపై మనకు పూర్తి అవగాహన ఉంటె తప్ప వీటిని నియంత్రించడం కష్టమైన పని. గూగుల్ దీనిని సులభతరం చేయడానికి Datally అనే యాప్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది . ఈ యాప్ ద్వారా ఏ ఏ ఇతర యాప్ లకి డేటా యాక్సెస్ ఇవ్వాలి లేకపోతే అదుపు చెయ్యాలి అన్నది యూజర్ నియంత్రించవచ్చు.

ఈ యాప్ usage access అనే పర్మిషన్ ని మన ద్వారా పొందటం ద్వారా ఏ ఏ అప్లికేషన్ డేటా ని అనవసరంగా ఉపయోగిస్తుందో గ్రహిస్తుంది . డేటా సేవర్ బటన్ ఆన్ చెయ్యగానే ఒక వర్చ్యువల్ ప్రైవేటు నెట్ వర్క్(VPN) సృష్టించడం ద్వారా డేటా యాక్సెస్ ని మిగతా యాప్స్ గ్రహించకుండా ఆపేస్తుంది. ఒకవేళ గూగుల్ నియంత్రించిన ఏ యాప్ కి ఐన డేటా బ్యాక్ గ్రౌండ్ లో అందివ్వాలి అంటే లాక్ సింబల్ అన్ లాక్ చేస్తే సరిపోతుంది. Datally యాప్ లో ఎంత డేటా సేవ్ చేసాం అన్నది, ఎంత డేటా ఉపయోగించాము అన్నది , ఎన్ని యాప్స్ కి డేటా యాక్సెస్ నియంత్రిన్చము అన్నది చూపిస్తుంది.

Datally డౌన్ లోడ్ కొరకు : http://bit.ly/2j38jeN

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *