Latest Tech Uncategorized

చైనా యాప్స్ ని డిలీట్ చెయ్యమని సూచించిన భారత హోమ్ శాఖ

చైనా నుంచి ఇండియా కు కొన్ని సరిహద్దు సమస్యలు ఉండడం, చైనా ఇండియా పై కత్తి కట్టినట్లు వ్యవహరిస్తూ ఉండడం ,డోఖ్లాం దగ్గర సైనిక బలగాల మోహరింపు లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత హోమ్ శాఖ భారతీయులందరికి మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా సైనికులకు ఈ ఆదేశాలు జారీ చేసింది. చైనా మన పొరుగునే ఉంటూ మన దేశానికి ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉండడం, మన దేశంలో చైనా మొబైల్ ఫోన్ లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం భారత దేశాన్ని కలవరపెడుతున్నాయి.

ఈ సమస్యల దృష్ట్యా భారత హోమ్ శాఖ చైనా కు సంబంధించిన ట్రూ కాలర్ , Weibo, WeChat తదితర అప్లికేషన్ లని ఉపయోగించవద్దని సూచించింది. ఈ యాప్స్ లో భారత వినియోగదారులు ఎక్కువగా వినియోగిస్తున్న యాప్ ట్రూ కాలర్. ఈ యాప్ దగ్గర ప్రతీ వినియోగదారుని కాల్ వివరాలు, కాంటాక్ట్ లు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా సైనికులు ఈ అప్లికేషన్ లని ఉపయోగించకపోవడం మంచిది అని ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

చైనా లో చాలా వరకు సర్వీస్ లపై ఆంక్షలు ఉన్నాయి. ప్రముఖమైన ఫేస్ బుక్ , గూగుల్, యూ ట్యూబ్ లాంటి వెబ్ సైట్ లపై కూడా అనేక ఆంక్షలు ఉన్నాయి. మన దేశంలోనే చాలా వరకు వెబ్ సైట్ లు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉన్నాయి. చాలా వరకు కంపెనీ లు వినియోగదారులు గోప్యత కు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించకపోవచ్చు.  కానీ , మన జాగ్రతలో మనం ఉండడం ఎందుకైనా మంచిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *