Latest Tech Uncategorized

Sets అనే అదిరిపోయే కొత్త ఫీచర్ విడుదల చేసిన Microsoft

 

Sets అనె పేరుతో ఒక కొత్త ఫీచర్ ని Windows 10 కి అందుబాటు లో తీసుకురానున్నట్టు Microsoft తెలిపింది.Sets ఫీచర్ ద్వారా ప్రస్తుతం వెబ్ బ్రౌజరు లో ట్యాబ్స్ ఉపయోగించిన విదంగా, ఈ ఫీచర్ ద్వారా ఒకే అప్లికేషన్ లో వేరు వేరు అప్లికేషన్ ని ఉపయోగించొచ్చు.

ఉదాహరణకు మీరు Word లో ఒక రిపోర్ట్ తయారు చేస్తుంటారు, మీకు ఒక కంపెనీ సంవత్సర ఆదాయం తెలుసుకోవడం కోసం ఆ కంపెనీ వెబ్ సైట్ తెరవాల్సి వచ్చింది. అందుకోసం మీరు బ్రౌజరు ని ఓపెన్ చేయటానికి బదులుగా మీకు అక్కడే ఉన్న టాబ్ పైన క్లిక్ చేసి మీరు తెరవాలనుకుంటున్న వెబ్ సైట్ ని తెరవచ్చు లేదా ఫోటోషాప్ అవసరం అయితే పక్కనే ఉన్న ట్యాబ్ ద్వారా తెరవవచ్చు. మీరు ఇంటర్ నెట్ కి అనుసంధానం అయి ఉంటే చేసిన మొత్తం పని ని సింక్ చేసి ఇతర కంప్యూటర్ లో మిగిలిన పనిని పూర్తి చేయవచ్చు.

ప్రస్తుతం Sets ఫీచర్ ని కొన్ని అప్లికేషన్ లకు మాత్రమె పరిమితం అయి ఉంది. అభివృద్ధి దశలో ఉన్న Sets గురించి Microsoft తన బ్లాగ్ లో ప్రస్తావించింది, విడుదల తేది తదితర ప్రకటించలేదు, విండోస్ 10 ఉన్న యూజర్లు డెవలపర్ అకౌంట్ ద్వారా ఈ ఫీచర్ ని ఇప్పుడే పొందవచ్చు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *