Mobile Uncategorized

డిసెంబర్ 7న RedMi 5 మరియు RedMi 5 Plus లను లాంచ్ చెయ్యనున్న Xiaomi (Official)

షియోమి తమ అధికారిక Weibo అకౌంట్ ద్వారా RedMi 5 అలానే RedMi 5 Plus లను డిసెంబర్ 7 వ తేదిన లాంచ్ చెయ్యబోతున్నట్లు తెలిపింది. ఈ డివైస్ లకు సంబంధించి ఎటువంటి సమాచారం కంపెనీ ద్వారా లేనప్పటికీ చాల వరకు సమాచారం లీక్ అయ్యింది. TENAA (చైనా మొబైల్ సర్టిఫికేషన్ సంస్థ) దగ్గర ఈ మొబైల్ కు సంబంధించిన కొన్ని కీ ఫీచర్లు లీక్ అయ్యాయి.

ఈ RedMi5 అలాగే RedMi5 ప్లస్ మొబైల్ లు 5.7 ఇంచ్ డిస్ ప్లే సైజ్ తో విడుదల అవుతున్నాయి. 18 : 9 నిష్పత్తి లో ఉండే అంచులు చిన్నగా ఉండే స్క్రీన్ తో ఈ మొబైల్ లు విడుదల అవుతున్నాయి.స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ పై ఈ రెండు మొబైల్ లు పని చేస్తాయి. RedMi5 మరియు RedMi5 ప్లస్ మొబైల్ లు 2 GB + 16 GB , 3GB + 32GB , 4GB + 64GB వేరియంట్ లలో లభిస్తాయి.

RedMi 5 కెమెరా 12 MP వెనుక వైపున , 5 MP ముందు వైపున ఉంటుంది.3,200 mAh బ్యాట్టరి కెపాసిటీ తో RedMi 5 లభిస్తుంది. RedMi 5 కి RedMi 4 లాగానే వెనుక వైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మెమరీ కార్డు కోసం ప్రత్యేకించిన స్లాట్ ఉంచారా లేదా అన్న సమాచారం లేదు, కానీ ఈ మొబైల్ 128 GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.

RedMi 5 plus కు సంబంధించి పెద్దగ సమాచారం ఏమి లేదు. కాని ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 625 చిప్ ఆధారితంగా పని చేస్తుంది. 4000 mAh బ్యాట్టరీ ఉంచినట్లు సమాచారం. ఈ మొబైల్ కూడా 18 : 9 నిష్పత్తి లోనే డిస్ ప్లే ఉంటుంది.

షియోమి కి సంబంధించి RedMi మొబైల్ లు ఇండియా లో చాలా పాపులర్ . ఈ మొబైల్ లే షియోమి ని సామ్ సంగ్ మార్కెట్ ను బీట్ చేసేలా చేసింది. దీనికి కృతజ్ఞతగా షియోమి RedMi 5A ధరణి 1,000 రూపాయలు 50 లక్షల మొబైల్ లు అమ్ముడు పోయవరకు ఉంచనున్నట్లు ప్రకటించింది. దీంతో RedMi 5అ ధర 4,999 రూపాయలకే లభిస్తుంది 50 లక్షల యూనిట్ ల వరకు.

Vishnu

May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *