Gadgets Uncategorized

Early Access ద్వారా అందుబాటులోకి వచ్చిన DxO అతికించుకునే కెమెరా

నెల క్రిందట ప్రకటించినట్టుగానే DxO అతికించుకునే కెమెరా ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇది అందరికి అందుబాటులో లేకపోయినప్పటికీ Early Access ద్వారా ఈ కెమెరా ని కొనవచ్చు. DxO కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో ఈ కెమెరా ప్యాక్ ని 499 డాలర్లకు Early Access ద్వారా కొనవచ్చు. ఈ కెమెరా USB-C టైపు ఉన్న మొబైల్ ఫోన్ లకు మాత్రమే పని చేస్తుంది.

ఈ DxO కెమెరా ఫోటో ల్యాబ్ సాఫ్ట్ వేర్ తో కలిపి వస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ప్రత్యేకించి ఆండ్రాయిడ్ మొబైల్ లకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసారు. ఈ DxO ప్రస్తుతానికి కొన్ని మొబైల్ లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అందులో HTC U11, Huawei Mate 9, Huawei P10, LG G9, :G V20, Moto Z, Nexus 5X, Nokia 8, Nubia Z11 mini, Samsung Galaxy A5 (2017), Samsung Note 8, Samsung S8, and Huawei Honor 9 మొబైల్ లు ఉన్నాయి. కాని గూగుల్ పిక్సెల్ 2 ఈ లిస్టు లో లేకపోవడం గమనార్హం. మిగతా మొబైల్ లు సపోర్ట్ చేస్తాయ లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం ఈ ఆండ్రాయిడ్ కు సంబంధించిన DxO కెమెరా దాదాపుగా iOS కు వదిలిన దాని లానే అన్ని ఫీచర్లు ఉన్నాయి .

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *