Mobile Uncategorized

MicroMax మొబైల్ లపై 2,200 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్న వొడాఫోన్

వొడాఫోన్ మైక్రో మాక్స్ సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకు ముందే చాలా రోజుల క్రితం మైక్రో మాక్స్ భారత్ అల్ట్రా 2 మొబైల్ ని 999 రూపాయలకే అందించడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు ఇతర మొబైల్ ఫోన్ లకు కూడా వర్తించేలా మార్చింది. ఈ ఒప్పందం లో దాదాపుగా 2,200 వరకు క్యాష్ బ్యాక్ వినియోగదారులకి వచ్చేలా ఆఫర్ ప్రకటించింది.

మైక్రో మాక్స్ భారత్ అల్ట్రా 2 అతి తక్కువ ధరలో దొరికే 4g మొబైల్ కాగా, ఆ తరువాతి వరుసలో తక్కువ ధరలో మైక్రో మాక్స్ భారత్ 2 ప్లస్ , మైక్రో మాక్స్ భారత్ 3 , మైక్రో మాక్స్ భారత్ 4 , మైక్రో మాక్స్ కాన్వాస్ 1 ఉన్నాయి. ఈ క్యాష్ బ్యాక్ మీకు కొన్న వెంటనే ఇవ్వరు. కొన్న తరువాత మీరు 36 నెలల వరకు కచ్చితంగా ప్రతినెలా కనీసం 150 రూపాయలతో రీఛార్జి చేసుకుంటూ ఉంటే 18 నెలల తరువాత కొంత, 36 నెలల తరువాత మిగతా కొంత వొడాఫోన్ m-pesa వాలెట్ లో కి వేస్తారు.

భారత్ 2 ప్లస్ మొబైల్ కొంటే 18 నెలల తరువాత 900, 36 నెలల తరువాత 1,300 క్యాష్ బ్యాక్ ఇవ్వడం ద్వారా 4,499 రూపాయలకు దొరికే మొబైల్ 1,549 రూపాయలకే లభిస్తుంది.

భారత్ 3 మొబైల్ కొంటే 18 నెలల తరువాత 900, 36 నెలల తరువాత 1,300 క్యాష్ బ్యాక్ ఇవ్వడం ద్వారా 3,749 రూపాయలకు దొరికే మొబైల్ 2,299 రూపాయలకే లభిస్తుంది.

భారత్ 4 మొబైల్ కొంటే 18 నెలల తరువాత 900, 36 నెలల తరువాత 1,300 క్యాష్ బ్యాక్ ఇవ్వడం ద్వారా 4,999 రూపాయలకు దొరికే మొబైల్ 2,799 రూపాయలకే లభిస్తుంది.

కాన్వాస్ 1 మొబైల్ కొంటే 18 నెలల తరువాత 900, 36 నెలల తరువాత 1,300 క్యాష్ బ్యాక్ ఇవ్వడం ద్వారా 5,999 రూపాయలకు దొరికే మొబైల్ 3,799 రూపాయలకే లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *