Cyber Security Uncategorized

Apple అప్ డేట్ తెచ్చిన సమస్యలు

Apple కంప్యూటర్ లలో root బగ్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ బగ్ కోసం Apple విషయం తెలిసిన 18 గంటల్లోనే వేగంగా Patch ను విడుదల చేసింది. అంతటితో సమస్య ఆగిపోయింది కానే Apple Mac OS Sierra కు వచ్చిన కొత్త అప్ డేట్ వల్ల సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. Apple Mac OS Sierra లో root అనే యూజర్ నేమ్ ఎంటర్ చెయ్యడం ద్వారా పాస్ వర్డ్ అవసరం లేకుండానే లాగిన్ అవ్వోచ్చు అన్న సంగతి తెలిసిందే . ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా Lemi Ergan అనే సెక్యూరిటీ పరిశోధకుడు తెలియజేసారు. ఈ సమస్య కి Apple 18 గంటల్లో ఫిక్స్ ని patch రూపంలో తీసుకు వచ్చింది.

Apple తీసుకొచ్చిన ఫిక్స్ ఈ సమస్యని తొలగించింది కానీ Apple Mac OS Sierra కు వదిలిన అప్ డేట్ ఈ patch ను లేకుండా చేస్తుంది. మళ్ళీ patch ను re-install చేసిన కూడా root బగ్ ను తొలగించట్లేదని సమాచారం. ఈ అప్ డేట్ నుంచి వెనక్కు వెళితే తప్ప ఈ root బగ్ patch పని చెయ్యదు లేదా కొత్త అప్ డేట్ patch తో సహా కలిపి వదిలితే తప్ప ఈ సమస్య పరిష్కారం అవ్వదు. మాల్వేర్ అప్లికేషన్ లు ఏదైనా కోతగా ఇంస్టాల్ చెయ్యాలి అన్నపుడు ఈ లాగిన్ అనేది దానికి అడ్డుగా నిలుస్తుంది. కానీ ఈ root బగ్ వల్ల మాల్వేర్ సులభంగా ఇంస్టాల్ చేసుకోగలదు. పర్సనల్ గా ఉపయోగించే కంప్యూటర్ అయితే అంతగా సమస్య ఉండకపోవచ్చు కాని నెట్ వర్క్ లో అనుసంధానం అయిన కంప్యూటర్ లలో అందరికి అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ దొరకడమనేది చాల ప్రమాదకరం. ఎవరైనా ఎవరి ఫైల్స్ అయిన యాక్సెస్ చెయ్యడమే కాకుండా వాటిని డిలీట్ , కాపీ లాంటివి కూడా చేయోచ్చు ఈ బగ్ తో. Apple ఎప్పట్లోపు ఈ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *