Apps Uncategorized

ఆండ్రాయిడ్ వెర్సన్ విడుదల అయిన Microsoft edge బ్రౌజర్

ఆఖరి నెల లో చెప్పినట్లుగా Microsoft తన edge బ్రౌజర్ ని ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ మరియు ఐఫోన్ యాప్ స్టోర్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తెసుకువచ్చింది. కంప్యూటర్ రంగం లో బాగా రాణించిన మైక్రోసాఫ్ట్, మొబైల్ మార్కెట్ లో మాత్రం విఫలం అయింది. అయినప్పటికి మొబైల్ వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు విండోస్ లో ఆదరణ పొందిన వివిధ అప్లికేషన్స్ ని ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ వినియోగదారులకు లకు అందుబాటులోకి తెసుకువస్తుంది.

ఇక Edge విషయానికి వస్తే ఎందులో రీడింగ్ లిస్ట్ ఫీచర్ ద్వారా వెబ్ పేజీ ని నెట్ లేకున్నా కూడా చదువుకోగల్గడం, థేమ్స్ మార్చుకోవడం, టైల్స్ విధానం లో టాబ్ ల అమరిక, తదితర ఫీచర్ లు ఉన్నాయి. Windows లో Edge బ్రౌజర్ ఉపయోగిస్తు అందులోని సేవ్ చేసిన డేటా ను వారు మైక్రోసాఫ్ట్ ఎకౌంటు ద్వారా ఆ మొత్తం డేటా సింక్ చేసి ఆ డేటా ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లోని edge లో పొందవచ్చు.

గూగుల్ అసిస్టెంట్ ని రీప్లేస్ చేయడానికి Cortana అనే అప్ ని మైక్రోసాఫ్ట్ అందుబాటులో కి తెచ్చింది ప్రస్తుతం ఎర్ల్ అక్సిస్ లో ఉన్మా ఈ అప్ కి మంచి ఆదరణ ఉంది. మొబైల్ లో ప్రస్తుతం అధికంగా ఉపయోగించే క్రోమ్ బ్రౌజరు కి Edge బ్రౌజరు ఎటువంటి పోటీని ఇవ్వనుందో వేచి చూడాలి. మీరు కూడా ఒకసారి Edge ని ఉపయోగించాలి అనుకంటే కింద ఉన్న లింక్ ని తెరవండి.

https://play.google.com/store/apps/details?id=com.microsoft.emmx

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *