Mobile Uncategorized

SAMSUNG లాంచ్ చేసిన కొత్త ఫ్లిప్ ఫోన్ SAMSUNG w2018

SAMSUNG తమ W సిరీస్ లో కొత్త ఫ్లిప్ ఫోన్ ని లాంచ్ చేసింది . ఇప్పుడు ఫ్లిప్ ఫోన్ లు ట్రెండ్ కానప్పటికీ SAMSUNG ఆ ట్రెండ్ ని ఇంకా కొనసాగిస్తూ ఉంది. SAMSUNG W సిరీస్ మొదలెట్టి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతోంది. ఈ మొబైల్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ అయిన SAMSUNG GALAXY, SAMSUNG NOTE  సిరీస్ లతో పోలిస్తే చాలా వరకు ఫీచర్లు దగ్గరలో కూడా లేనప్పటికీ SAMSUNG W2018 మోడల్ కెమెరా మాత్రం అద్బుతంగా ఉంది. ఈ ఫ్లిప్ ఫోన్ మోడల్ ఆసియాలో లో ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ఫ్లిప్ ఫోన్ ధర ఫ్లాగ్ షిప్ మొబైల్ లకంటే కూడా ఎక్కువ ధర ఉండడం ఆశ్చర్యం.

SAMSUNG W2018 మోడల్ కెమెరా 12 మెగా పిక్సెల్ సామర్థ్యం తో f 1.5 aperture తో లభిస్తుంది. ఈ మొబైల్ షార్ప్ గ ఫోటోలను చిత్రిస్తుంది. తక్కువ కాంతిలో కూడా ఇతర మొబైల్ లతో పోలిస్తే అద్భుతమైన క్వాలిటీ ని అందిస్తుంది. ఈ మొబైల్ కి ముందు వైపున 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ఇందులోని ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా f 2.4 aperture బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉంది అన్నది సెన్స్ చేసి మార్చుకుంటుంది అని కంపనీ తెలిపింది.ఈ మొబైల్ లేటెస్ట్ గ వచ్చిన ఆండ్రాయిడ్ ఓరియో తో కాకుండా నౌగట్ ఆపరేటింగ్ సిస్టం తోనే  విడుదల అయింది.

SAMSUNG W2018 కు ముందు వైపున 4.2 ఇంచుల HD అమోలెడ్ డిస్ ప్లే ఉంది. పాత ఫ్లిప్ ఫోన్ ల మాదిరిగానే రెట్రో స్టైల్ లో కీ పాడ్ ఉంది. వెనుక వైపున బ్యాక్ కెమెరా ప్రక్కన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే మిగతా SAMSUNG మోడల్ లలాగే దీనికి కూడా BixBy వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంది. ఈ మొబైల్ గొరిల్లా గ్లాస్ సహితంగా గోల్డ్ మరియు ప్లాటినం మెటల్ మరియు గ్లాస్ సహితంగా వస్తుంది. స్నాప్ డ్రాగన్ క్వాల్ కామ్ 825 ప్రాసెసర్ తో 6GB RAM , 64 / 256 అంతర్గత మెమరీ ఛాయిస్ లతో లభిస్తుంది.SAMSUNG W2018 2,300 mAh బ్యాట్టరీ కెపాసిటీ తో లభిస్తుంది.దీని ధర 3000 డాల్లర్లు గ ఉంది.

Vishnu

May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *