Latest Tech Uncategorized

కొత్త అన్ లాక్ పద్ధతి పై పేటెంట్ తీసుకున్న SAMSUNG

SAMSUNG కంపెనీ కొత్త పద్దతి ద్వారా మొబైల్ సెక్యురిటిని రక్షించే విధానం కొరకు పేటెంట్ పొందింది. SAMSUNG చాలా వరకు apple ను అనుసరిస్తుంది అని విమర్శలు ఉన్నాయి. Apple కంపెనీ ఈ సంవత్సరం కొత్తగా తీసుకు వచ్చిన FACE ID విధానాన్ని కూడా రాబోయే SAMSUNG మొబైల్ లలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో SAMSUNG కొత్త సెక్యురిటి విధానం పై పేటెంట్ తీసుకోవడం అన్నది చర్చనీయాంశం అయింది. ఈ కొత్త విధానం లో మొబైల్ ముందుగా యూజర్ యొక్క అరచేతిని ఫోటో తీసుకుంటుంది. అరచేతి రేఖలను గుర్తుంచుకొని , యూజర్ పాటర్న్ లాక్ మర్చిపోయినపుడు దానికి సంబంధించిన హింట్ ని యూజర్ యొక్క అరచేతిపై చూపిస్తుంది. ఇంకా ఏ ఏ రకాల పాస్ వర్డ్ పద్ధతులు సపోర్ట్ చేస్తాయి అన్న సమాచారం ఇంకా లేదు.SAMSUNG ఈ అరచేతి పద్దతి ని SAMSUNG GALAXY S9 లో తీసుకు రాకపోవచ్చు. APPLE ప్రవేశపెట్టిన ఫేస్ అన్ లాక్ పద్దతిని అప్పుడే ONE PLUS 5T అంది పుచ్చుకుంది. SAMSUNG GALAXY S9 లో కూడా ఈ ఫీచర్ పై ప్రయోగాలు జరుగుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *