Uncategorized

Weekly Report (02-12-2017) – ఈ వారం టెక్ విషయాలు క్లుప్తంగా.

 

ఈ వారం SAMSUNG కంపెనీ , షియోమి కంపెనీ, Gionee కంపెనీ, ఇండియాలో Nokia కంపెనీ మొబైల్స్ లాంచ్ చేసాయి.

SAMSUNG కంపెనీ ఖరీదైన ఫ్లిప్ ఫోన్ SAMSUNG W2018 ని విడుదల చేసింది. ఈ మొబైల్ ధర దాదాపుగా 3,000 డాల్లర్లు. Read More : http://t.tech24.in/5

షియోమి కంపెనీ RedMi 5A మొబైల్ ని అతి తక్కువ ధరలో 4,999 రూపాయల ధరకే విడుదల చేసింది. 50 లక్షల యూనిట్ ల అమ్మకం వరకు ఈ ధర 4,999 గా ఉంటుంది.తర్వాత 5,999 రూపాయలకే అమ్మకం ధర ఉంటుంది. Read More : http://t.tech24.in/2

6,999 రూపాయలకే నోకియా 2 మొబైల్ ఇండియాలో ఆఫ్ లైన్ స్టోర్ లలో లభిస్తుంది .
Read More : http://t.tech24.in/9

Gionee 8 మొబైల్స్ ని లాంచ్ చేసింది. వీటి ధర 150 $ – 667 $ మధ్యలో ఉండొచ్చు. అన్ని మొబైల్స్ అంచులు లేని విధంగా 18:9 నిష్పత్తిలో ఉన్నాయి. Read More : http://t.tech24.in/6

ఈ డిసెంబర్ 7 న షియోమి RedMi 5 అలాగే RedMi 5 plus మొబైల్ లను లాంచ్ చేయ్యనున్నట్లు తమ అధికారిక Weibo అకౌంట్ ద్వారా తెలియజేసింది. Read More : http://t.tech24.in/7

లెనోవో కంపెనీ తమ లెనోవో నోట్ 4 మొబైల్ పై 1,000 రూపాయల ధర తగ్గించింది. 3GB మరియు 4GB వెర్షన్ రెండిటిపై ఈ ధర తగ్గింపు వర్తిస్తుంది. Read More : http://t.tech24.in/8

41 చైనా అప్లికేషన్ లని స్పై వేర్ గా గుర్తించినట్లు అలాగే వాటిని వినియోగించవద్దని భారత హోం శాఖా తెలిపింది. వాటిల్లో True Caller, Weibo లాంటి ప్రముఖ యాప్స్ కూడా ఉన్నాయి. Read More : http://t.tech24.in/a

ఫ్లాష్ లైట్ యాప్ లలో బ్యాంక్ బాట్ మాల్వేర్ ఉన్నట్లు గమనించి ప్లే స్టోర్ కొన్ని యాప్ లని తొలగించింది.
Read More : http://t.tech24.in/b

బిట్ కాయిన్ విలువ 10,000 దాటి ఇప్పుడు 11,000 పైన కొనసాగుతూ ఉంది. Read More : http://t.tech24.in/c

Apple కంప్యూటర్ లలో root అనే యూజర్ నేమ్ ద్వారా పాస్ వర్డ్ అవసరం లేకుండానే లాగిన్ అయ్యే బగ్ ని Apple కంపెనీ 18 గంటల్లోనే patch తీసుకు రావడం ద్వారా పరిష్కరించింది. Read More : http://t.tech24.in/d

SAMSUNG అరచేతి స్కానింగ్ ద్వారా అన్ లాక్ చేసే పద్దతికి పేటెంట్ తీసుకుంది . Read More : http://t.tech24.in/e

DxO అతికించుకునే కెమెరా 499 డాల్లర్ లకే Early Access ద్వారా లభిస్తుంది. Read More : http://t.tech24.in/f

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *