Latest Tech Uncategorized

పాత చందమామ పుస్తకాలు ఇక నెట్టింట్లో చదవొచ్చు

చందమామ పుస్తకాలు 80 దశకాన్ని, 90 వ దశకాన్ని ఎంతగా ప్రభావితం చేసాయో అందరికి తెలిసిందే. ప్రస్తుత తరం సెల్ ఫోన్ గేమ్ ల మాయలో పడి బాల్యం కోల్పోతుంటే ఆ తరం మాత్రం ఎన్నో ఆటలతో , చందమామ కథలతో జ్ఞానాన్ని పెంచుకుని ఎదిగిన విషయం తెలిసిందే. చందమామ పుస్తకం అప్పట్లో కాస్తో కూస్తో చదువు ఉన్న వాళ్ళ ఇంట్లో ముఖ్యమైన కాలక్షేపం.ప్రతీ నెల ఆ పుస్తకం కోసం ఎదురు చూస్తూ,పాత పుస్తకాలనే తిరగేసిన వాళ్ళు లేకపోలేదు. అలాంటి చందమామ పుస్తకం ఈ నవ జీవన తరంగం లో నిలువలేకపోయింది.

ఇప్పుడు చందమామ సంస్థ ఆ పుస్తకలన్నింటిని నెట్టింట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దాదాపుగా 1954 సంవత్సరం నుండి 1986 సంవత్సరం దాక ప్రతీ నెలకు సంబంధించిన మాస పత్రిక ను ఇందులో దిగుమతి(download) చేస్కొడానికి అందుబాటులో ఉంచారు. తెలుగు , ఆంగ్లం , హిందీ భాషల్లో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా భాషల్లో వి కూడా త్వరలో అందుబాటులోకి తీస్కుని వస్తున్నట్లు వెబ్ సైట్ లో తెలిపారు. Our Favorites అనే విభాగం ద్వారా ఎడిటర్ లకు నచ్చిన పుస్తకాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. ఈ పుస్తకాలు pdf ఫైల్ రూపంలో లభిస్తుంది. అక్కడే అయినా చదువుకోవచ్చు లేదా డౌన్ లోడ్ చేసుకుని అయినా చదువుకోవచ్చు.

చందమామ సంస్థ లింక్ : http://bit.ly/2zKZFIp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *