Mobile Uncategorized

OnePlus5T STAR WARS స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేసిన OnePlus

OnePlus లేటెస్ట్ గా విడుదల చేసిన OnePlus5T స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ మొబైల్ లలో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా చైనా రో కొద్దిరోజుల క్రితమే లిమిటెడ్ ఎడిషన్ గా లావా రెడ్ కలర్ లో OnePlus5T మొబైల్ ని విడుదల చేసింది. ఇప్పుడు అదే కోవలో ఇండియా లో మాత్రమే లభించేలా STAR WARS లిమిటెడ్ ఎడిషన్ ని విడుదల చేసింది. ఈ STAR WARS ఎడిషన్ ఇండియాలో STARWARS THE LAST JEDI సినిమా ట్రైలర్ విడుదలకు ఒకరోజు ముందుగ అంటే డిసెంబర్ 14 వ తేదిన ఇండియాలో విడుదల చేస్తారు.

ఈ STAR WARS లిమిటెడ్ ఎడిషన్ మొబైల్ ముందువైపు నలుపు రంగులో , వెనుక వైపు తెలుపు రంగులో ఉంటూ STAR WARS లోగో వెనుక వైపున ఎరుపు రంగులో ఉంటుంది. పవర్ బటన్ కూడా ఎరుపు రంగులో ఉంటుంది. ముందు వైపు హోం స్క్రీన్ పై STAR TROOPER చిత్రం ఉండడం వల్ల సాఫ్ట్ వేర్ లో కూడా స్టార్ వార్స్ కు సంబంధించి థీమ్ ని మార్పులు చేర్పులు చేసి ఉండొచ్చు.

ఈ STAR WARS లిమిటెడ్ ఎడిషన్ OnePlus5T మొబైల్ ని డిసెంబర్ 14 న ఫాన్స్ సమక్షంలోనే లాంచ్ చేస్తారు. ఈ లాంచ్ ఈవెంట్ టికెట్ లు ఒక్కొకటి 999 రూపాయలు. PAYTM ద్వారా ఈ టికెట్స్ డిసెంబర్ 7 వ తేదిన ఉదయం 10 గంటలనుంచి సేల్ చేస్తారు.

OnePlus5T పూర్తి ఫీచర్ల గురించి మీరు >>> ఇక్కడ <<< చదవొచ్చు.
OnePLus5 కి OnePlus5T కి గల తేడాల గురించి మీరు >>> ఇక్కడ <<< చదవొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *