Mobile Uncategorized

RedMi5 మరియు RedMi5 Plus ఫోటోలు విడుదల చేసిన షియోమి.

డిసెంబర్ 7 న RedMi5 అలాగే RedMi5 Plus మొబైల్ లను విడుదల చేస్తున్నట్లు షియోమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి సంబంధించి కొన్ని ఫోటోలను షియోమి కంపెనీ మార్కెటింగ్ హెడ్ Donovon Sung విడుదల చేసారు . ఈ ఫోటోలలో ఫోన్ గురించిన సమాచారం ఎక్కువగా లేకపోయినప్పటికీ, ఫోన్ లుక్ గురించిన వివరాలు గ్రహించవచ్చు. రెండు మోడల్స్ కూడా చిన్న అంచులతో, 18:9 డిస్ ప్లే తో వస్తున్నాయి.

చాలా వరకు బ్రాండ్స్ ఈ చిన్న అంచులు ఉండే 18:9 డిస్ ప్లే తోనే విడుదల అవుతున్నాయి. కానీ ఈ రెండు మోడల్స్ మాత్రమే చాల తక్కువ ధరలో లభిస్తాయి. RedMi 5 మొబైల్ ప్రారంభ ధర 6,999 వద్ద నుంచే మొదలవుతుంది. షియోమి కంపనీకి కూడా ఈ RedMi సిరీస్ ఎంతో ముక్యమైనది. ఎందుకంటే ఇండియాలో Top 5 మొబైల్స్ మొదటి మూడు RedMi సిరీస్ కు సంబంధించిన RedMi Note 4, RedMi 4, RedMi 4A మోడల్స్ యే. ఈ మోడల్స్ ఏ షియోమి ని SAMSUNG కంపెనీ ని వెనక్కు నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్ సొంతం చేసుకునేలా చేసింది.

RedMi 5 ధర దాదాపుగా RedMi 4 లాగానే 6,999 (2GB+16GB) , 8,999 (3GB+32GB) , 10,999 (4GB+64GB) ఉండొచ్చు. RedMI 5 plus గురించిన సమాచారం ఏమి ఇప్పటివరకు లేదు. RedMi 5 మొబైల్ కు , RedMi 5 plus కు తేడా ఏమి ఉండొచ్చు అన్నది కూడా ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *