Latest Tech Uncategorized

#GoogleForIndia – Google భారత యూజర్ల కోసం చేసిన కొత్త ప్రకటనలు.

Google సంస్థ #GoogleForIndia పేరిట ఈరోజు ఢిల్లీ లో ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో గూగుల్ లో పని చేస్తున్న ఇండియన్ ఉద్యోగుల ద్వారా గూగుల్ ఇండియా కు చేస్తున్న/ చెయ్యబోతున్న ప్లాన్ ల గురించి తెలియజేసింది. ఇందులో ఇప్పటికే రిలీజ్ అయిన ఆప్స్ తో సహా కొత్తగా విడుదల చెయ్యబోతున్న ఫీచర్ల గురించి కూడా తెలిపింది. ఈ ఈవెంట్ ఈ రోజు 11 గంటల 50 నిమిషాల నుంచి మొదలయ్యింది.

 

గూగుల్ ఆండ్రాయిడ్ ఓరియో వెర్షన్ ని ఇండియా అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్లు ఈ ఈవెంట్ లో తెలియజేసింది. 2018 లో లాంచఅయ్యే డివైస్ లలో ఈ ఓరియో వెర్షన్ ఉండబోతున్నట్లు అలాగే పెర్ఫార్మెన్స్ పరంగా, సెక్యూరిటీ పరంగా , స్టోరేజ్ పరంగా ఇండియా వినియోగదారుల అవసరార్థం మార్పులు చేసినట్లు వెల్లడించారు.

Google Assistant ని ఎంట్రీ లెవెల్ డివైస్ లలో కూడా రన్ అయ్యే విధంగా తక్కువ మెమరీ తో విడుదల చేస్తున్నట్లు తెలిపారు . ఈ సందర్భంగా జియో ఫోన్ లో ఉన్న గూగుల్ అసిస్టెంట్ గురించి, భారతీయ భాషల సపోర్ట్ గురించి వివరించారు. గూగుల్ అసిస్టెంట్ లో భారత భాష అయిన హిందీ లో కూడా అస్సిస్తేంట్ పని చేస్తుందని తెలిపారు.

Files Go అనే ఆప్ ద్వారా ఆండ్రాయిడ్ డివైస్ లలో మెమరీ సమస్యని చాల వరకు తగ్గించుకోవచ్చని, ఈ ఆప్ అనవసరమైన ఫైల్స్ ని వెతికి చూపించడమే కాకుండా , డూప్లికేట్ ఫైల్ లని , ఎక్కువగా వినియోగించని ఫైల్స్ ని, ఎక్కువగా వినియోగించని ఆప్స్ ని విభాగాల వారిగా ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఈ ఆప్ Early Access ద్వారా ఇంతకుముందే లాంచ్ అయింది. కాని ఇప్పుడు అధికారికంగా అందరికి లాంచ్ చేసారు.

Google search ఆప్ ఇకనుంచి ఎంట్రీ లెవెల్ తక్కువ మెమరీ ఉన్న ఫోన్ లలో కూడా ఉపయోగించేలా తక్కువ మెమరీ తో డిజైన్ చేసారు. Google Go ఆప్ 5 MB లోనే లభిస్తుంది .

గూగుల్ మ్యాప్స్ ఇండియాలో బైక్ ఉపయోగించేవారికోసమే ప్రత్యేకంగా బైక్ మోడ్ అనే ఫీచర్ ని వదిలారు. ఈ ఫీచర్ ద్వారా బైక్ లు వెళ్ళగలిగే దగ్గరి దారులని చూపించడం ఈ ఫీచర్ ప్రత్యేకత .

Google Tez ఇంతకుముందే మార్కెట్ లో లాంచ్ అయింది. ఈ ఈవెంట్ లో కొత్తగా చెప్పిన విషయమేమిటంటే త్వరలో తేజ్ ద్వారా రీచార్జ్ , విద్యుత్ బిల్ పే చెయ్యడం లాంటివి చెయ్యొచ్చని , ఆ ఫీచర్లని త్వరలో తీసుకువస్తున్నట్లు తెలిపారు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *