Apps Uncategorized

బైక్ వినియోగించేవారికి Google Maps తీసుకొచ్చిన అద్బుతమైన ఫీచర్ – Bike Mode

బైక్ వినియోగించేవారికి ట్రాఫిక్ విషయంలో కార్ లాంటి 4 వీలర్స్ కంటే ఎక్కువగా ట్రాఫిక్ ను తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. సరిగ్గా ఈ విషయాన్నే గూగుల్ అర్థం చేసుకుని బైక్ మోడ్ అనే కొత్త ఫీచర్ ను మ్యాప్స్ అప్లికేషన్ లో విడుదల చేసింది. బైక్ వినియోగదారుల కోసం స్పెషల్ గ రూట్ లను సిద్దం చేసింది. ట్రాఫిక్ ఏ రూట్ లో తక్కువగా ఉంటుందో ఈ ఫీచర్ ద్వారా తెలియజేస్తుంది.

ఈ ఫీచర్ ఇండియాలో ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ఆప్షన్ ని మనం ఏదైనా రూట్ కోసం వెతికాక బైక్ మోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యడం ద్వారా యాక్సెస్ చెయ్యవచ్చు. మాములుగా బైక్ చిన్న చిన్న రూట్ లలో కూడా వెళ్ళగలదు కాబట్టి , కార్ లతో పోల్చుకుంటే బైక్ ద్వారా వెళ్ళగలిగే సమయం చాల తక్కువగా ఉంటుంది . బైక్ ఫీచర్ ద్వారా గమ్యానికి బైక్ వెల్ల గల చిన్నదారులతో సహా దగ్గరి రూట్ చూపించడం ద్వారా ట్రాఫిక్ ను తప్పించుకునే అవకాశం ఉంటుంది. దాదాపుగా 250 కిలో మీటర్ల దురాన్ని బైక్ కి , కార్ లాంటి వెహికల్స్ కి పోల్చుకుంటే 40 నిమిషాల మేర దురాన్ని సమయాన్ని తగ్గించవచ్చు.

ఈ ఫీచర్ అందుబాటులోకి రావాలంటే మ్యాప్స్ అప్లికేషన్ వెర్షన్ v.9.67.1 పైన ఖచ్చితంగా ఉండాలి.ఈరోజు Google For India పేరుతో ఇండియా కు సంబంధించిన విషయాల గురించి అనౌన్స్ మెంట్ ఉంది. అందులో ఇంకా ఇండియాకు సంబంధించి ఏం ఏం ప్లాన్ చేస్తున్నారు అన్న విషయాలు తెలుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *