Latest Tech Uncategorized

Airtel, Jio, Vodafone, Idea ల 4G స్పీడ్ ప్రకటించిన TRAI

Reliance Jio అన్ని టెలికాం ఆపరేటర్ లకంటే ఎక్కువ స్పీడ్ ని నమోదు చేసింది. ఈ అక్టోబర్ లో 21.9 Mbps వేగంతో జియో పాత స్పీడ్ రికార్డు 19.1 Mbps స్పీడ్ ని బీట్ చేసింది. ఈ Jio 4G వేగం రెండవ స్థానంలో ఉన్న vodafone తో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. జియో సగటు వేగం ఇండియా మొత్తం ఒకేలా ఉండకపోయినప్పటికి ఈ విలువ ని సరాసరి గ లెక్కించి తెలిపారు.

Download స్పీడ్ విషయానికి వస్తే Jio సెప్టెంబర్ లో 18.4 Mbps స్పీడ్ ఉంటె ఆ రికార్డు ని దాటి అక్టోబర్ లో 21.9 స్పీడ్ ని అందుకుంది. Vodafone సగటు డౌన్ లోడ్ స్పీడ్ 8.7 Mbps కాగా, Idea సగటు డౌన్ లోడ్ స్పీడ్ 8.6 Mbps మరియు Airtel డౌన్ లోడ్ స్పీడ్ 7.5 Mbps గా ఉంది. ఈ మూడింటి సరాసరి స్పీడ్ దాదాపుగా 9 Mbps ఉంది. ఈ మొత్తం Jio తో పోల్చితే 2.5 రెట్లు తక్కువ కావడం విశేషం.

Upload వేగం విషయానికి వస్తే Idea ఈ విషయంలో టాప్ ప్లేస్ లో ఉంది. 6.4 Mbps వేగంతో Uploads పరంగా టాప్ ప్లేస్ లో ఉంది. vodafone 5.9 Mbps వేగంతో రెండవ స్థానంలోను , జియో 4.1 Mbps వేగంతో మూడవ స్థానంలోను ఉన్నాయి. Airtel అప్ లోడ్ వేగం 4.5 నుంచి 3.5 కు పడిపోవడం విశేషం. Vodafone మరియు Idea ల వేగం 5.8 నుంచి 6.9 Mbps ల మధ్యలో ఉగిసలాడుతూ ఉండగా జియో అప్ లోడ్ వేగం పెరగకుండా తాగకుండా అలానే ఉంటూ వస్తుంది.

ఈ వివరాలన్నీ My Speed అనే అప్లికేషన్ ద్వారా TRAI తెలుసుకుంటూ విశ్లేషిస్తూ అందించిన వివరాలు. TRAI ప్రభుత్వం టెలికాం నెట్వర్క్ ల చర్యలను నిర్దేశించడానికి నెలకొల్పిన సంస్థ. ఎంతో మంది వినియోగదారుల వివరాలను ఆప్ సేకరించడం ద్వారా డేటా ను సేకరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *