Latest Tech Uncategorized

Youtube ని Amazon డివైజ్ లలో నిలిపేస్తున్న Google.

Amazon మరియు Youtube మధ్య ఒక చిన్న వార్ నడుస్తూ ఉంది కొన్ని నెలలుగా. ఇప్పుడది తారా స్థాయికి చేరింది. నిజం చెప్పాలంటే ఈ వార్ గూగుల్ కి అమెజాన్ కి మధ్య జరుగుతుందని చెప్పవచ్చు. గూగుల్ కంపెనీ యోక్క వాయిస్ అసిస్టెంట్ Google Home అలాగే అమెజాన్ యొక్క Amazon Alexa ఈ వార్ కి పరోక్షమైన కారణంగా తెలుస్తూ ఉంది. గూగుల్ సంస్థ కి అమెజాన్ సంస్థ సహకరించకపోవడం వల్లనే ఇలా చెయ్యాల్సి వస్తుందంటూ గూగుల్ వాపోతోంది.

నిజానికి ఈ సమస్య తలెత్తింది అమెజాన్ కంపెనీ తమ స్టోర్ లో గూగుల్ ప్రోడక్ట్ అయిన క్రోమ్ కాస్ట్ , Google Home, Nest హార్డ్ వేర్ పరికరాలని ఉంచడానికి ఉత్సాహం చుపించాకపోవడమే గూగుల్ కి అమెజాన్ కి మధ్య దూరం పెరాగడానికి కారణం. ఈ కారణంగానే వచ్చే జనవరి 1 వ తేది నుంచి అమెజాన్ ఎకో స్పీకర్ లలో కాని అమెజాన్ ఫైర్ టీవీ లలో కాని youtube అప్లికేషన్ పని చేయదు. ఈ విషయాన్ని అంతలోపే పరిష్కరించుకుంటామని గూగుల్ తెలిపింది. సయోధ్య కుదరకపోతే కచ్చితంగా జనవరి 1 నుంచి youtube ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఈ విషయానికి అమెజాన్ ఇలా స్పందించింది.

గూగుల్ అందరికి అందుబాటులో ఉండే youtube ని కావాలనే కొంతమందికి సెలెక్టివ్ గా అందుబాటులోకి రాకుండా చెయ్యడం డిసప్పాయింట్ చేస్తుంది

గూగుల్ కూడా క్రోమ్ కాస్ట్ లో అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇవన్ని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ ను లొంగదీయడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు పెద్ద కంపెనీల గొడవ ఆ కంపెనీ ల ఉత్పత్తులు కొన్నవారికి చిరాకు తెప్పిస్తున్నాయి. వీటినుంచి ఎంత త్వరగా పరిష్కరించుకుంటే ఆ రెండు కంపెనీలకు అంత మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *