Shopping Deals Uncategorized

MiA1 మొబైల్ పై 2,000 ధర తగ్గించిన Xiaomi

MiA1 Image

Xiaomi కంపెనీ నుంచి విడుదల అయిన మొట్టమొదటి డ్యూయల్ కెమెరా మొబైల్ షియోమి #MiA1 ధర 2,000 రూపాయలు తగ్గింది. ఈ మార్పు ఫ్లిప్ కార్ట్ ద్వారా డిసెంబర్ 7 వతేదీ నుంచి వర్తిస్తుంది. మాములుగా 14,999 రూపాయల ధర ఉండే ఈ మొబైల్ డిస్కౌంట్ తర్వాత 12,999 కే లభిస్తుంది. ఈ ధర మార్పు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్బంగా ఇస్తున్నారు. 9 డిసెంబర్ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Buy Here : Xiaomi MiA1

 

MiA1 ఫీచర్ల విషయానికి వస్తే ఈ మొబైల్ హార్డ్ వేర్ Xiaomi కంపెనీ ఏ తయారు చేసినప్పటికీ గూగుల్ ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్ వేర్ ద్వారా నిర్మితమైంది. ఈ మొబైల్ లో ముక్యంగా చెప్పుకోవాల్సింది దీని డ్యూయల్ కెమెరా. మెయిన్ కెమెరా మరియు సెకండరీ కెమెరా రెండు 12 MP సామర్థ్యం కలిగి ఉంది అద్భుతమైన ఫోటోలను అందిస్తాయి. షియోమి దీన్ని ప్రచారం చేసుకోడానికి #MiA1 ఫోటోగ్రఫీ ఛాలెంజ్ పేరిట 19 లక్షల రూపాయల ప్రైజ్ మొత్తాన్ని ప్రకటించింది. MiA1 కెమెరా ద్వారా 2X ఆప్టికల్ జూమ్ ని , అలాగే 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో డీప్ లెర్నింగ్ అల్గోరిథం ఉండడం వల్ల తనను తాను portrait ఫోటోల విషయంలో మెరుగుపరుచుకుంటూ ఉంటుందని కంపెనీ వెబ్ సైట్ లో తెలిపారు.

1920 x 1080 పిక్సెల్ క్వాలిటీ తో 5.5 ఇంచ్ ఫుల్ HD డిస్ ప్లే , గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ మొబైల్ లో లభిస్తుంది. ఈ మొబైల్ ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 4 GB RAM మరియు 64 GB అంతర్గత మెమరీ ఈ మొబైల్ ఫోన్లో లభిస్తుంది. గూగుల్ ద్వారా మీడియా కోసం అపరిమిత స్టోరేజ్ ఇవ్వబడుతుంది. 3080 mAh బ్యాట్టరీ కెపాసిటీ తో USB-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా ఈ మొబైల్ లభిస్తుంది.ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుకవైపు , రిమోట్ ల ఉపయోగించడానికి వాడే IR బ్లాస్టర్ ముందు వైపు ఉన్నాయి.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *