Latest Tech Uncategorized

మీ ప్రశ్నలకు సెలబ్రిటీ లే సమాధానమిచ్చేల వీడియో ఫీచర్ తీసుకురానున్న Google

Posts By Google

సన్నీ లియోన్ కు పిల్లలంటే ఇష్టమా లేదా ??? ప్రియాంక చోప్రాకు ఇష్టమైన రంగు ఏది ??? ముకేష్ అంబాని ఫ్రీ టైం లో ఎం చేస్తారు ??? రతన్ టాటా మల్లి మల్లి చదివిన పుస్తకం ఏంటి???

ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం ఒకరకంగా కష్టమే. ఎవరైనా ముఖా ముఖి ( ఇంటర్వ్యూ) ద్వారా ఇలాంటి ప్రశ్నలు అడిగిన కచ్చితంగా మీకు వచ్చే ప్రశ్నలకు సమాధానం దొరకడం కష్టమే. వీటిని కొంతైనా తీర్చడానికి గూగుల్ ప్రయత్నిస్తూ ఉంది. ఎక్కువగా సెలబ్రిటీ లపై సెర్చ్ చేస్తున్న ప్రశ్నలకు గూగుల్ సెలబ్రిటీల ద్వారా సెల్ఫీ వీడియోలు రికార్డు చేయించి వాటిపై సెర్చ్ చేస్తున్న ఫాన్స్ కి ఈ సెల్ఫీ వీడియో కనిపించేలా గూగుల్ ప్రయత్నిస్తుంది.

ఈ ఫీచర్ లో భాగంగా ప్రస్తుతం కొంత మంది సెలబ్రిటీ లు మాత్రమే భాగమయినప్పటికీ త్వరలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంది. ప్రస్తుతానికి Priyanka Chopra, Will Ferrell, Tracee Ellis Ross, Gina Rodriguez, Kenan Thompson, Allison Williams, Nick Jonas, Mark Wahlberg, James Franco, Seth MacFarlane, Jonathan Yeo మరియు  Dominique Ansel మాత్రమే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ లో పాలు పంచుకున్నారు. ఇందులో ప్రశ్నలు అడగడానికి చెయ్యాల్సిందేమీ లేదు గూగుల్ లో శోధించడం తప్ప. ఎక్కువగా శోధించిన వాటిని గూగుల్ పరిగణనలోకి తీస్కుని ఆ యా సెలబ్రిటీ లకు వీలైనప్పుడు సెల్ఫీ వీడియో ద్వారా సమాధానం గూగుల్ తీసుకుని తరువాత ఎప్పుడైనా గూగుల్ లో అదే విషయాన్ని శోధిస్తే ఆ వీడియో ప్లే అయ్యేలా చేస్తుంది. ఈ ఫీచర్ కి Posts On Google పేరిట సెలబ్రిటీ లను మాత్రమే కాకుండా కంపెనీ లను కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.

SOURCE FROM : TECH CHRUNCH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *