Latest Tech Uncategorized

Youtube వీడియోలని శుద్ధి చెయ్యడానికి 10,000 మందిని నియమిస్తున్న Google

 

Youtube ని ఇప్పుడు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. కంటెంట్ చూసే వాళ్ళు మాత్రమే కాకుండా , కంటెంట్ తయారు చేసి కేవలం Youtube వ్యూస్ ఆధారంగా వచ్చే ఆదాయం పైనే చాలా మీడియా ఛానళ్ళు పని చేస్తూ ఉన్నాయి. వీటిలోని కంటెంట్ ఎక్కడైనా దొంగిలించార అన్నదానికి youtube కృత్రిమ మేధస్సు సరిపోతుంది కాని కంటెంట్ అందరు చూడదగినదేనా కాదా అన్నది నిర్ధారించుటకు, Youtube వీడియో లలోని కామెంట్ లను ఫిల్టర్ చెయ్యడానికి Youtube కు మనుషుల సహాయమే అవసరమవుతుంది.

Youtube లో కంటెంట్ ఎవరైనా ఎటువంటి అడ్డంకులు లేకుండా పబ్లిష్ చేసుకోవచ్చు. అదీ కాక Youtube అందరికి అందుబాటులో ఉండడం వలన ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వీడియో ల రూపంలో చెప్తారు. కాని కొంతమంది మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు  చెయ్యడమే కాక అందరు చూడలేనటువంటి వీడియోలు పబ్లిష్ చేస్తారు. దీన్ని నివారించడానికి Youtube 10,000 మందిని నియమించుకోబోతుందని Youtube CEO Susan Wojcicki తెలిపింది. ఇప్పటివరకు youtube కంటెంట్ ని ఎంతమంది ఫిల్టర్ చేస్తున్నారు అన్న విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు నియమించుకుంటున్న వాళ్ళు కేవలం వీడియో లు మాత్రమే కాకుండా కామెంట్ ల పరంగా కూడా ఫిల్టర్ చేస్తారు. ఈ వీడియో లని ఎవరైనా రిపోర్ట్ చేయ్యనంతవరకు youtube టీం పట్టించుకోదు . ఎవరైనా రిపోర్ట్ చేస్తేనే దానిని వీక్షించి youtube పాలసీ లకు అనుగుణంగా ఉండ లేదా అన్నది నిర్ధారించి వీడియో ని ఉంచదమో తీసేయ్యడమో చేస్తారు.

Etihad ఎయిర్ వేస్ , Mariotte , Deliverooo లాంటి సంస్థలు తమ యాడ్ లని Youtube నుంచి తొలగించారు. ఒక రేచాగోట్టే ప్రసంగాలు చేసే వ్యక్తి యొక్క వీడియో లో ఆ యాడ్ లు వస్తుండడంతో సదారి కంపెనీలే యాడ్ లను విరమించుకున్నాయి. దీంతో youtube తమ పాలసీ లలో మార్పులు చేసి ఇలాంటి విద్వేషా పూరితమైన వీడియో లని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తూ youtube ని ఎవ్వరికి అభ్యంతరకరంగా ఉండకుండా చూడడానికి 10,000 మందిని నియమించుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *