Mobile Uncategorized

శాశ్వతంగా 1000 రూపాయల ధర తగ్గిన Xiaomi Mi A1

MiA1 Image

డ్యూయల్ కెమెరా గలా Mi A1 ధర 1000 తగ్గించినట్టు Xiaomi సంస్థ ఇండియా ప్రతినిధి మను జైన్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 14,999 ఉన్న ఈ మొబైల్ ధర ప్రస్తుతం 13,999 కే లభించనుంది. తగ్గినా ఈ మొబైల్ ని Flipkart మరియు Mi స్టోర్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

MiA1 ఫీచర్ల విషయానికి వస్తే ఈ మొబైల్ హార్డ్ వేర్ Xiaomi కంపెనీ ఏ తయారు చేసినప్పటికీ గూగుల్ ఆండ్రాయిడ్ వన్ సాఫ్ట్ వేర్ ద్వారా నిర్మితమైంది. ఈ మొబైల్ లో ముక్యంగా చెప్పుకోవాల్సింది దీని డ్యూయల్ కెమెరా. మెయిన్ కెమెరా మరియు సెకండరీ కెమెరా రెండు 12 MP సామర్థ్యం కలిగి ఉంది అద్భుతమైన ఫోటోలను అందిస్తాయి. షియోమి దీన్ని ప్రచారం చేసుకోడానికి #MiA1 ఫోటోగ్రఫీ ఛాలెంజ్ పేరిట 19 లక్షల రూపాయల ప్రైజ్ మొత్తాన్ని ప్రకటించింది. MiA1 కెమెరా ద్వారా 2X ఆప్టికల్ జూమ్ ని , అలాగే 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో డీప్ లెర్నింగ్ అల్గోరిథం ఉండడం వల్ల తనను తాను portrait ఫోటోల విషయంలో మెరుగుపరుచుకుంటూ ఉంటుందని కంపెనీ వెబ్ సైట్ లో తెలిపారు.

1920 x 1080 పిక్సెల్ క్వాలిటీ తో 5.5 ఇంచ్ ఫుల్ HD డిస్ ప్లే , గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ మొబైల్ లో లభిస్తుంది. ఈ మొబైల్ ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 4 GB RAM మరియు 64 GB అంతర్గత మెమరీ ఈ మొబైల్ ఫోన్లో లభిస్తుంది. గూగుల్ ద్వారా మీడియా కోసం అపరిమిత స్టోరేజ్ ఇవ్వబడుతుంది. 3080 mAh బ్యాట్టరీ కెపాసిటీ తో USB-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా ఈ మొబైల్ లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుకవైపు , రిమోట్ ల ఉపయోగించడానికి వాడే IR బ్లాస్టర్ ముందు వైపు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *