Apps Uncategorized

Google Duo కొత్త ఫీచర్

Google Duo ఇన్నిరోజులు స్తబ్దుగా ఉంచిన ఫీచర్ ని ఇప్పుడు వెలుగులోకి తీసుకు వచ్చింది. Google Duo యాప్ ద్వారా మనం హై క్వాలిటీ వీడియో కాల్స్ చెసుకోవచ్చు. ఈ Google Duo యాప్ లోనే ఇప్పుడు కొత్త ఫీచర్ రాబోతుంది. ఈ ఫీచర్ ద్వారా సిమ్ కార్డు ద్వారా వాయిస్ కాల్ మాట్లాడుతున్నపుడు ఒక చిన్న బటన్ క్లిక్ చెయ్యడం ద్వారా Google Duo వీడియో కాల్ లోకి మారిపోతుంది.

Google Duo వీడియో కాలింగ్ యాప్ లో వీడియో కాల్స్ చాలా క్వాలిటీ గా ఉంటాయి. Google Duo లో ఈ ఫీచర్ కు సంభందించిన కోడ్ చాలా వెర్షన్ ల ముందు నుంచే ఉన్నప్పటికీ ఇప్పుడే ఈ ఫీచర్ యాప్ లో వచ్చింది. ఈ ఫీచర్ నార్మల్ కాల్ మాట్లాడ్తున్నపుడే ఆక్టివేట్ అవుతుంది. బటన్ క్లిక్ చెయ్యగానే ఇద్దరి మొబైల్ లలోను చిన్న పాప్ అప్ లాంటిది వచ్చి దాన్ని క్లిక్ చెయ్యగానే Google Duo లో వీడియో కాల్ మొదలవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ కి చాల తక్కువ సమయమే తీస్కుంటుంది కాబట్టి పెద్దగ మధ్యలో గ్యాప్ లాంటిది ఏమి రాదు. వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్ కు Fraction Of Seconds లోనే మారిపోతుంది. ఇలా Google Duo వీడియో కాల్ కు మారిపోగానే వాయిస్ కాల్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఒకవేళ వీడియో కాల్ యాక్సెప్ట్ చెయ్యకపోతే కొన్ని సెకండ్ లలో వాయిస్ కాల్ కంటిన్యూ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *