Google సంస్థ మూడు కొత్త ఫోటోగ్రఫి ఆప్ లను Appsperiments పేరిట విడుదల చేసింది . ఇందులో Story Board అనే ఆప్ కేవలం ఆండ్రాయిడ్ కే విడుదల చేయగా, Selfissimo అనే ఆప్ ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటికి విడుదల చేసారు. ఇంకో ఆప్ Scrubbies కేవలం iOS కు మాత్రమే విడుదల చేసారు. Google కంపెనీ ద్వారా ఇంతకుముందే విడుదల అయిన ఫోటో ఎడిటింగ్ ఆప్ SnapSeed ఉన్నప్పటికీ ఈ మూడు ఆప్ లను Google నిన్న విడుదల చేసింది.
సంవత్సరం క్రితం వదిలిన మోషన్ స్టిల్స్ అనే ఆప్ గూగుల్ పరిశోధన నిమిత్తం డెవలప్ చెయ్యగా దాన్ని పూర్తి ఫంక్షనాలిటి తో విడుదల చేసింది. అదే కోవలో ఇప్పుడు ఈ మూడు ఆప్స్ ని కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది.
మొదటి ఆప్ అయిన Story Board లో ఏదైనా వీడియో క్లిప్ తీస్తే అందులో నుంచి ఆటోమేటిక్ గా 6 ఫ్రేమ్ లను కామిక్ బుక్ లా మార్చుతుంది. కొత్త ఫ్రేమ్ లు తీస్కోవాలి అంటే రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ఇలా దాదాపుగా 1.6 trillion కాంబినేషన్ లని ఈ ఆప్ సృష్టించగలదని Google తెలిపింది.(పై ఫోటో లో మాదిరిగా )
రెండవ ఆప్ అయిన Selfissimo లో మనం మూవ్ అవుతున్నపుడు కాకుండా ఆగిపోయిన ప్రతీ పోజ్ ని Black & White కలర్ లో షూట్ చేస్తుంది. ఈ ఆప్ లో వేరే వేరే పోజ్ లలో ఆటోమేటిక్ గా ఫోటో లు తీసుకోవచ్చు.
మూడవ ఆప్ అయిన Scrubbies లో DJ స్టైల్ లో వీడియోని రీ మిక్స్ చెయ్యవచ్చు. ఇందులో వీడియో కంటెంట్ ని మనకు కావలసినంత వేగంలో వెనక్కి ముందుకి మూవ్ అయ్యేలా చేస్తూ వీడియో లూప్ లని సృస్తించ వచ్చు.